Asianet News TeluguAsianet News Telugu

రేపు డా. కాలువ మల్లయ్య సప్తతి సాహిత్య సంబురాలు

ప్రముఖ రచయిత డాక్టర్ కాలువ మల్లయ్య 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అదే సమయంలో యాభై ఏళ్ల సాహితీ వ్యక్తిత్వాన్ని కొనసాగించారు. ఈ సందర్బంగా కాలువ మల్లయ్య సాహితీ సంబురాలు జరగనున్నాయి.

Telugu writer Kaluva Mallaiah 70th birth day celebrations
Author
Hyderabad, First Published Jan 15, 2022, 4:48 PM IST

భౌతికంగా జరగాల్సిన డా. కాలువ మల్లయ్య సప్తతి సాహిత్య సంబురాలను  కోవిడ్ దృష్ట్యా జూమ్ లో యథావిధిగా కొనసాగేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. జనవరి16 ఆదివారం ఉదయం11 గంటలకు జూమ్ లో జరిగే  తొలి సమావేశ అధ్యక్షులుగా  అన్నవరం దేవేందర్, ముఖ్య అతిథిగా  అల్లం రాజయ్య, విశిష్ట అతిథులుగా శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సంకెశాల మల్లేశం, అడిషనల్ కలెక్టర్లు గాజుల శ్యాం ప్రసాద్ లాల్ ,  వనమాల చంద్రశేఖర్ , డా. మలయశ్రీ, జింబో, జూకంటి జగన్నాథం, నగునూరి శేఖర్, మలి సమావేశ అధ్యక్షులుగా గాజోజు నాగభూషణం, ముఖ్య అతిథిగా బి.ఎస్. రాములు, విశిష్ట అతిథులుగా పెద్దింటి అశోక్ కుమార్, డా. బి వి ఎన్ స్వామి, పిట్టల రవీందర్, దాస్యం సేనాధిపతి, కందుకూరి అంజయ్య, కె.వి సంతోష్ బాబు, వేణుశ్రీ, నారాయణ శర్మ తదితరలు పాల్గొంటారు. కాలువ మల్లయ్య రాసిన రెండు పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది.

డా. కాలువ మల్లయ్య 70యేండ్ల జీవితం, 50యేండ్ల సాహితీ సృజన జీవితం సందర్భంగా 30మంది సాహితీవేత్తలకు "డా.కాలువ మల్లయ్య ప్రతిభా పురస్కారాలు" , 100మంది సృజనకారులకు "డా. కాలువ మల్లయ్య స్ఫూర్తి పురస్కారాల"ను కోవిడ్ తీవ్రత తగ్గిన తర్వాత ప్రదానం చేస్తున్నట్టు సాహితీ సోపతి సమన్వయకర్త కూకట్ల తిరుపతి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios