Asianet News TeluguAsianet News Telugu

దాసరాజు రామారావు కవిత : చిట్టిగుట్ట

పాప ఏడుపు ఎలా తగ్గింది ?  గ్రైఫ్ వాటర్ పట్టారా! లేక తాత వీపు గుర్రమెక్కిందా!! తెలుసుకోవాలంటే టెక్సాస్ నుండి దాసరాజు రామారావు రాసిన కవిత  ' చిట్టిగుట్ట ' ఇక్కడ చదవండి

dasaraju ramarao poem ksp
Author
First Published Mar 3, 2024, 2:07 PM IST

పాప ఏడ్చింది-

ఇంట్లో బొమ్మలు అలిగినయి
ఏసీకి  గొంతు నులిమినట్లున్నది
వెండిగిన్నెలో పాలబువ్వ నీరు నీరైయింది
మొగులు దిగులుగా విషాద భైరవాన్నే ఎత్తుకొన్నది

కడుపు నొప్పా? కాదేమో!
కసురు మాట  తగిలిందేమో

పాప నవ్వింది-

ఆట వస్తువుల ఆట మొదలైంది
వెన్నెల ఉద్విగ్నమై, పరిమళం చిమ్మింది
గోరుముద్దలు మరింత తీపి కెక్కినయి
గగన మొగంలో హిందోళం చిందేసింది

నొప్పి తగ్గిందా? 
గ్రైఫ్ వాటర్ పట్టారా!
లేదులే..
తాత వీపు గుర్రమెక్కింది గదా!!

Follow Us:
Download App:
  • android
  • ios