Asianet News TeluguAsianet News Telugu

టి‌ఎస్ పి‌జి‌ఈ‌సి‌ఈ‌టి 2023 షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాలేజీలు/ యూనివర్సిటీలు/ సంస్థల నుంచి ఆర్కిటెక్చర్/ ఫార్మసీ/ టెక్నాలజీ/ ఇంజినీరింగ్ కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్‌లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తెలంగాణలోని ప్రైవేట్ ఇంకా ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశానికి అర్హులు.  

TS PGECET 2023: Application Form(3rd March) Exam Dates (Out) here-sak
Author
First Published Feb 28, 2023, 12:56 PM IST

టి‌ఎస్ పి‌జి‌ఈ‌సి‌ఈ‌టి 2023 నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తుల షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ (JNTU)విడుద‌ల చేసింది.  దరఖాస్తు ఫారమ్  3 మార్చి 2023  నుండి విడుదల చేయబడుతుంది. ఈ  పరీక్షలు 29 నుండి 31 మే & 1 జూన్ 2023 వరకు నిర్వహించబడుతుంది. తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET) అనేది జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, హైదరాబాద్ (JNTUH) ద్వారా నిర్వహించబడే రాష్ట్ర-స్థాయి ఇంజనీరింగ్  ప్రవేశ పరీక్ష . 

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాలేజీలు/ యూనివర్సిటీలు/ సంస్థల నుంచి ఆర్కిటెక్చర్/ ఫార్మసీ/ టెక్నాలజీ/ ఇంజినీరింగ్ కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్‌లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తెలంగాణలోని ప్రైవేట్ ఇంకా ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశానికి అర్హులు.  

TS PGECET 2023 
పరీక్ష పేరు:    TS PGECET
ఫుల్ ఫార్మ్:  తెలంగాణ రాష్ట్ర పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
కండక్టింగ్ బాడీ:    ఉస్మానియా యూనివర్సిటీ
పరీక్ష స్థాయి:          స్టేట్ లెవెల్ 
పరీక్ష విధానం:       ఆన్‌లైన్
అప్లికేషన్ మోడ్:     ఆన్‌లైన్
పరీక్ష  ఫ్రీక్వెన్సీ:      సంవత్సరానికి ఒకసారి
పరీక్షా మాధ్యమం:   ఇంగ్లిష్

TS PGECET 2023 పరీక్ష తేదీలు
 TS PGECET 2023 అధికారిక నోటిఫికేషన్: 8 ఫిబ్రవరి 2023
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 2023
ఆలస్య రుసుము లేకుండా ఫారమ్ సబ్మిట్ చివరి తేదీ: ఏప్రిల్ 2023 2వ వారం
ఆలస్య రుసుముతో ఫారమ్‌ను సబ్మిట్ చివరి తేదీ: మే 1వ వారం 2023
హాల్ టికెట్ లభ్యత:     మే 2023 2వ వారం
TS PGECET పరీక్ష: 29 నుండి 31 మే & 1 జూన్ 2023 వరకు
 

ఫీజును AP ఆన్‌లైన్/ TS ఆన్‌లైన్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ పేమెంట్ గేట్‌వేల ద్వారా సమర్పించవచ్చు:
 
క్యాటగిరి                           దరఖాస్తు ఫీజు 
SC/ ST/ PH అభ్యర్థులు:     రూ. 600/-
ఇతర కేటగిరీ అభ్యర్థులు:     రూ 1100/-

మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 వరకు: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంటుంది.
మే 2 నుంచి 4: దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తారు.
మే 5 నుంచి 24: రూ.250 నుంచి రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.
మే 21 నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభమవుతుంది
మే 29 నుంచి జూన్‌ 1 వరకు: 19 సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి.
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

 అర్హత ప్రమాణాలు
నేషనలిటి: TS PGECET కోసం దరఖాస్తు చేసుకోవడానికి భారతీయ జాతీయులు మాత్రమే అర్హులు.
నివాసం: దరఖాస్తు చేసుకునే అభ్యర్థి అర్హత పొందేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నివాస ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
అకడమిక్ అర్హత: సంబంధిత స్ట్రీమ్/డిసిప్లిన్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ప్రవేశానికి అర్హులు.
అర్హత మార్కుల ప్రమాణాలు: అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50% మార్కులు (రిజర్వ్డ్ కేటగిరీ విషయంలో 45% మార్కులు) పొంది ఉండాలి.
 2023లో చివరి సంవత్సరం పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా ప్రవేశానికి అర్హులు.

మరింత సమాచారం లేదా పూర్తి వివరాల కోసం : https://pgecet.tsche.ac.in/ పై క్లిక్ చేయండి

Follow Us:
Download App:
  • android
  • ios