Asianet News TeluguAsianet News Telugu

10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. నోటిఫికేషన్‌ విడుదల.. వెంటనే అప్లయ్ చేసుకొండి..

భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న డిపార్ట్‌మెంట్‌లో పని చేసే స్కోప్ కోసం ఎదురుచూస్తున్న వారికి  శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు అండ్ భారత ప్రభుత్వ కార్యాలయాలలో జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్-సి నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఎస్‌ఎస్‌సి ఎం‌టి‌ఎస్ పరీక్షను నిర్వహిస్తుంది.

SSC MTS Recruitment 2023 Notification Out 12523 Vacancies apply online here
Author
First Published Jan 23, 2023, 5:23 PM IST

ఎస్‌ఎస్‌సి ఎం‌టి‌ఎస్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 18 జనవరి 2023న అఫిషియల్ వెబ్‌సైట్  ద్వారా  విడుదల చేసింది.  అయితే మొత్తం 12,523 ఖాళీలను జనవరి 20న ప్రకటించింది . అభ్యర్థులు  ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షకు 18 జనవరి 2023 నుండి 17 ఫిబ్రవరి 2023 వరకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్ 1 పరీక్ష ఏప్రిల్ 2023లో నిర్వహించబడుతుంది.  
 
 స్టాఫ్ సెలక్షన్ కమీషన్ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు అండ్ భారత ప్రభుత్వ కార్యాలయాలలో జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్-సి నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఎస్‌ఎస్‌సి ఎం‌టి‌ఎస్ పరీక్షను నిర్వహిస్తుంది. భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న డిపార్ట్‌మెంట్‌లో పని చేసే స్కోప్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్త. ప్రతి సంవత్సరం లక్షల మంది అభ్యర్థులు ఎస్‌ఎస్‌సి ఎన్‌టి‌సి పరీక్షకు హాజరవుతారు. 
 
ఎస్‌ఎస్‌సి ఎం‌టి‌ఎస్  రిక్రూట్‌మెంట్ 2023
సంస్థ             స్టాఫ్ సెలక్షన్ కమిషన్
పరీక్ష పేరు    మల్టీ టాస్కింగ్ స్టాఫ్
పోస్ట్                గ్రూప్ సిలో వివిధ పోస్టులు 
ఖాళీలు    MTS: 11994 

 సెలెక్షన్ ప్రక్రియ    
CBE
 డాక్యుమెంట్ వెరిఫికేషన్
 
అధికారిక వెబ్‌సైట్     ssc.nic.in

SSC MTS 2023 నోటిఫికేషన్ PDF
SSC MTS నోటిఫికేషన్‌తో పాటు, స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ప్యూన్, డఫ్టరీ, జమాదార్, జూనియర్ జెమ్‌స్టోన్ ఆపరేటర్, చౌకీదార్, సఫాయివాలా, మాలి, హవల్దార్ మొదలైన వివిధ పోస్టులకు అభ్యర్థులను రిక్రూట్ చేస్తుంది. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు పేతో కూడిన జీతం పొందుతారు. 7వ పే కమీషన్ పే మ్యాట్రిక్స్ ప్రకారం లెవెల్-1 బేసిక్ పే రూ. 5,200-20,200 + గ్రేడ్ పే రూ.1,800.  

 ఆన్‌లైన్‌లో దరఖాస్తు 
SSC MTS 2023 నోటిఫికేషన్ విడుదలతో SSC MTS ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఇచ్చిన లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. SSC MTS రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ 18 జనవరి 2023 నుండి 17 ఫిబ్రవరి 2023 వరకు ఉంటుంది.

తేదీలు
ఎస్‌ఎస్‌సి ఎం‌టి‌ఎస్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ    18 జనవరి 2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు  చివరి తేదీ          17 ఫిబ్రవరి 2023
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్ చేయడానికి చివరి తేదీ    19 ఫిబ్రవరి 2023
చలాన్ తో ఫీజు పేమెంట్ చివరి తేదీ        20 ఫిబ్రవరి 2023
 
 విద్యా అర్హత
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ (10వ తరగతి ఉత్తీర్ణత) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఒకవేళ అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌ను ముగింపు తేదీకి ముందు పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే, అతను లేదా ఆమె దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడరు.

వయోపరిమితి
అభ్యర్థికి 18-25 ఏళ్లు ఉండాలి.
కటాఫ్ తేదీ నాటికి అభ్యర్థికి 18-27 ఏళ్లు ఉండాలి
ముందుగా పేర్కొన్న వయస్సు పాటు రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఇవ్వబడుతుంది.

దరఖాస్తు ఫీజు 
SSC MTS 2023 కోసం దరఖాస్తు ఫీజు రూ. 100/-.
SC/ST/PWD/మాజీ సైనికులు/మహిళల కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నుండి మినహాయించబడతారు.

Follow Us:
Download App:
  • android
  • ios