Asianet News TeluguAsianet News Telugu

లేఆఫ్‌లు, నియామకాలు స్లోడౌన్.. జాబ్‌ మారేందుకు వెనకడుగు వేస్తున్న ఉద్యోగులు.. నివేదికలో కీలక విషయాలు..

ఓ వైపు లేఆఫ్‌లు.. మరోవైపు నియామకాల్లో మందగమనం  కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి. ఈ క్రమంలోనే తాజా నివేదికలో ఆసక్తికర విషయం వెల్లడైంది.

Nearly Half of Employees Do not Plan To Switch Jobs in 2023 due to Layoffs and Hiring Slowdown Says Report ksm
Author
First Published Apr 18, 2023, 9:34 AM IST

ఓ వైపు లేఆఫ్‌లు.. మరోవైపు నియామకాల్లో మందగమనం  కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి. ఈ క్రమంలోనే తాజా నివేదికలో ఆసక్తికర విషయం వెల్లడైంది.  దాదాపు సగం మంది ఉద్యోగులు 2023లో ఉద్యోగాలను మార్చుకునే ఆలోచనలో లేరని గ్లోబల్ జాబ్ సైట్ ఇండిడ్ నివేదిక పేర్కొంది. కొనసాగుతున్న అనిశ్చితులు ఉద్యోగార్ధులు, యజమానులను జాగ్రత్త పడేలా  చేస్తున్నాయి. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసిన దాదాపు సగం మంది ఉద్యోగులు (47 శాతం) 2023లో ఉద్యోగాలు మారడానికి ఇష్టపడటం లేదు. గ్లోబల్ జాబ్ సైట్ ఇండిడ్ నివేదిక ప్రకారం, ఇంటర్వ్యూ చేసిన 47 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత సంస్థల్లో కొనసాగేందుకు మొగ్గుచూపుతున్నారు. 37 శాతం మంది 2023లో తమ కెరీర్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు. ఇక, డీమోనిటైజేషన్ తర్వాత రెండేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు కోల్పోడం జరిగిందని నిరుద్యోగంపై ఎస్‌డబ్ల్యూఐ 2019 నివేదిక కనుగొంది.

2023 జనవరి-ఫిబ్రవరి మధ్య కాలంలో 1,157 మంది యజమానులు, 1,583 మంది ఉద్యోగార్ధుల మధ్య వ్యాలువోక్స్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది. కొనసాగుతున్న అనిశ్చితుల మధ్య, ఉద్యోగార్ధులు, యజమానుల మొత్తం సెంటిమెంట్ జాగ్రత్తగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే బీఎఫ్‌ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్), హెల్త్‌కేర్ వంటి కొన్ని రంగాల్లో గణనీయమైన నియామకాలను కనిపిస్తున్నాయి. ఈ రంగాలకు బలమైన భవిష్యత్తును ప్రదర్శిస్తున్నాయి. 2023లో తొలగింపులు, నియామకాల మందగమనం నేపథ్యంలో దాదాపు 50 శాతం మంది భారతీయ కార్మికులు ఉద్యోగాలను మార్చడానికి ప్రణాళికలు చేయడం  లేదు. 

‘‘2023లో గిగ్ ఎకానమీని ఆమోదించడం కూడా జాబ్ మార్కెట్‌ను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. యజమానులు ఇప్పుడు ఈ టాలెంట్ పూల్‌ను నిలుపుకోవడానికి, ఆకర్షిస్తూ ఉండే మార్గాలను రూపొందించడంపై దృష్టి పెట్టాలి’’ ఇండిడ్ ఇండియా హెడ్ ఆఫ్ సేల్స్ శశికుమార్ తెలిపారు.

ఇంకా, బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లో హైరింగ్‌లో గణనీయమైన పెరుగుదల కనిపించిందని.. ఈ కాలంలో 71 శాతం సెక్టార్ ఎంప్లాయర్‌లను నియమించుకున్నారని నివేదిక వెల్లడించింది. హెల్త్‌కేర్ (64 శాతం), కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ (57 శాతం) రంగాలు కూడా గణనీయంగా నియామకాలు పొందాయని పేర్కొంది. దీనికి విరుద్ధంగా.. మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ (49 శాతం), ఐటీ/ఐటీఈఎస్ (29 శాతం), తయారీ (39 శాతం) రంగాలు ఈ కాలంలో అతి తక్కువ నియామకాలను నమోదు చేశాయని నివేదిక పేర్కొంది.

మిడ్-లెవల్ (27 శాతం), సీనియర్-లెవల్ రోల్స్ (12 శాతం) కోసం నియామకం చేసే యజమానుల నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇక, నివేదిక ప్రకారం.. మొదటి సారి జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశించే ఉద్యోగార్ధుల నిష్పత్తి కూడా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 16 శాతం నుండి 23 శాతానికి పెరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios