Asianet News TeluguAsianet News Telugu

Bank Jobs 2022: IBPS RRB నోటిఫికేషన్ విడుదల.. 7 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

మరో బ్యాంక్ నోటిఫికేషన్‌ను విడుదలైంది. రీజనల్ రూరల్ బ్యాంక్‌లో ఉద్యోగాల కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ ఈ రోజు (6వ తేదీ) విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 

IBPS released RRB notification for group a and group b officers.. check out details
Author
New Delhi, First Published Jun 6, 2022, 10:48 PM IST

IBPS RRB notification 2022: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ రీజినల్ రూరల్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ ఏ అధికారులు స్కేల్ 1,2,3, గ్రూప్ బీ ఆఫీసు అసిస్టెంట్ (మల్టీ పర్పస్) నోటిఫికేషన్ ఈ రోజు (6వ తేదీ) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ అప్లికేషన్‌‌ ఈ నెల 7వ తేదీ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, దరఖాస్తు ప్రక్రియ మొదలగు విషయాలపై ఐబీపీఎస్ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ పోస్టులకు దరఖాస్తు చేయగోరే అభ్యర్థులు ముందుగా అర్హతలను సమగ్రంగా చదివిన తర్వాతే దరఖాస్తు చేయడం ఉత్తమం. తద్వారా తమ దరఖాస్తు తిరస్కరణకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అన్ని వివరాలు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడి అవుతాయి. అయితే, తాజాగా, రీజనల్ రూరల్ బ్యాంక్‌ ఉద్యోగాలకు సంబంధించి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో దరఖాస్తుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.

దరఖాస్తులకు చివరి తేదీ:
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ దరఖాస్తు జూన్ 7వ తేదీ నుంచి ఓపెన్ అవుతుంది. జూన్ 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఈ కాలంలో దరఖాస్తును మాడిఫై లేదా ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇదే గడువులో ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ కోసం దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఉంటుంది.

ప్రిలిమ్స్ ఎప్పుడంటే?
ఐబీపీఎష్ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ 2022 ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టులో ఉంటాయి. ఈ ప్రిలిమ్స్ ఫలితాలు సెప్టెంబర్‌లో వెలువడతాయి. కాగా, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ 2022 మెయిన్ పరీక్ష సెప్టెంబర్ లేదా నవంబర్‌లో ఉండే అవకాశం ఉన్నది.

దరఖాస్తుకు అవసరమైనవి..
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ 2022 నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్థులు తమ పాస్‌పోర్టు సైజు ఫొటో స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు సంతకం, రాతపూర్వక డిక్లరేషన్, ఎడమ బొటన వేలి ముద్రలను స్కాన్ చేయాల్సి ఉంటుంది.

మెయిన్స్ తర్వాత గ్రూప్ ఏ ఆఫీసర్స్ (స్కేల్ 1,2,3) అభ్యర్థులకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. నవంబర్‌లోనే ఇంటర్వ్యూ కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. నాబార్డ్ సహకారం, ఐబీపీఎస్ సంప్రదింపులతో రీజనల్ రూరల్ బ్యాంక్స్ అధికారులు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios