Asianet News TeluguAsianet News Telugu

గాల్లోనే ఊడిన విమానం టైర్: పైలెట్ ఏం చేశాడంటే?

విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో టైర్ ఊడిపోయింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన పైలెట్  విమానాన్ని  సురక్షితంగా ల్యాండ్ చేశారు.

 United Airlines flight loses tyre mid-air during takeoff from San Francisco, makes emergency landing lns
Author
First Published Mar 8, 2024, 2:05 PM IST

వాషింగ్టన్: శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన విమానానికి చెందిన టైర్  ఊడిపోవడంతో  అత్యవసరంగా ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు పైలెట్.అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుండి  జపాన్ కు  వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం మధ్య టైర్ ఊడిపోయింది.  దీంతో  లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.జపాన్ కు వెళ్లేందుకు  249 మంది  ప్రయాణీకుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేశారు.

also read:రాజ్యసభకు సుధా మూర్తి నామినేట్: శుభాకాంక్షలు తెలిపిన మోడీ

శాన్ ఫ్రాన్సిస్కో  విమానాశ్రయం నుండి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే  విమానం టైర్ ఒకటి ఊడిపోయింది.ఈ టైర్ ఎయిర్ పోర్టులోని పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన కారుపై పడి ఆ కారు ధ్వంసమైంది.

also read:40 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపారు: దాడి ఇంటికి కొణతాల

ఈ విషయాన్ని గుర్తించిన  పైలెట్  లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో  విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.  ఈ ఘటనపై  సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని  విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.

also read:భారత జాగృతి సమితి, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం: జీవో నెంబర్ 3 ఏముంది?

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన  విమానం టైర్  ఊడిపోయింది.  దీంతో  ఈ విమానాన్ని  అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios