Asianet News TeluguAsianet News Telugu

5 నిమిషాల్లోనే 6 వేల అడుగులు కిందికి.. సింగపూర్ విమానంలో తీవ్ర అల్లకల్లోలం..  అసలేం జరిగిందంటే?

London Singapore Flight Air Turbulence: సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్ర అల్లకల్లోలం ఏర్పడింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. 

Singapore Airlines Passengers Face Deadly Turbulence As Their Flight Drops 6,000 Feet In 5 Minutes KRJ
Author
First Published May 21, 2024, 9:48 PM IST

London Singapore Flight Air Turbulence: విమానంలో ప్రయాణించాలంటేనే భయపడాల్సి వస్తుంది. గత రెండు రోజుల క్రితమే ఇరాన్ ప్రమాణంలో దుర్మరణం పాల్పయ్యారు. ఈ ప్రమాదం మరిచిపోయక ముందే మరో ప్రమాదం వెలుగులోకి వచ్చింది. కానీ.. అంత స్థాయిలో కాదు. తాజాగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్ర అల్లకల్లోలం ఏర్పడింది. దీంతో విమానం తీవ్ర స్థాయిలో కుదుపులు ఏర్పడ్డాయి. త్రుటిలో ప్రమాదం తప్పి .. అత్యవసర ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. ఈ గందరగోళం కారణంగా ఒకరు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. 

వివరాల్లోకి వెళితే.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ చెందిన విమానం SQ321 హీత్రూ విమానాశ్రయం నుండి సింగపూర్‌కు వెళ్తుంది. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా విమానంలో అల్లకల్లోలం ఏర్పడింది. దీంతో విమానాన్ని స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:45 గంటలకు బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలో మొత్తం 211 మంది ప్రయాణికులు కాకుండా 18 మంది సిబ్బంది ఉన్నారు. వాస్తవానికి ఈ విమానం సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయంలో సాయంత్రం 6:10 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడినట్లు థాయ్ మీడియా నివేదికలు చెబుతున్నాయి. విమానం ల్యాండ్ అయిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారని థాయ్ ఇమ్మిగ్రేషన్ పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది? 

టేకాఫ్ అయిన 11 గంటల తర్వాత ప్రతికూల వాతావరణం కారణంగా విమానం మయన్మార్ గగనతలంలో 37 వేల అడుగుల ఎత్తులో గాలి అల్లకల్లోలంలో చిక్కుకుంది. ఈ సమయంలో విమానం అనేక కుదుపులకు గురైంది. కేవలం 5 నిమిషాల్లోనే 37 వేల అడుగుల ఎత్తు నుంచి 31 వేల అడుగులకు విమానం పడిపోయింది.  ఈ సమయంలో చాలా మంది ప్రయాణికులు తమ సీట్లలోంచి పైకి లేచారు.చాలా మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంతో ప్రయాణీకులు తీవ్ర  భయాందోళనలకు గురయ్యారు. దీని తర్వాత విమానాన్ని భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:15 గంటలకు బ్యాంకాక్‌కు మళ్లించారు. ఇక్కడి సువర్ణభూమి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వాస్తవానికి ఈ విమానం సింగపూర్‌లో మధ్యాహ్నం 3:40 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios