Asianet News TeluguAsianet News Telugu

షాక్ మిగిల్చిన జాక్ పాట్ : రూ. 2,800 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు.. తీరా డబ్బులకోసం వెడితే...

లాటరీ కంపెనీ మీద కేసు వేశాడో వ్యక్తి. ఆ కారణం వింటే కాసేపు మనసు కలుక్కుమని.. నిజమే కదా అనిపిస్తుంది. 

Shocking Jackpot : Rs. He won 2,800 crore lottery, Company Says It Was A Mistake - bsb
Author
First Published Feb 20, 2024, 3:44 PM IST

న్యూఢిల్లీ : వాషింగ్టన్ డీసీకి చెందిన ఒక వ్యక్తికి రూ. 2,800 కోట్ల జాక్ పాట్ తగిలింది. ఒకేసారి ఒకటికాదు, రెండు కాదు వేలకోట్ల జాక్ పాట్ తో అతను సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు. తన డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి సదరు లాటరీ ఆఫీసుకు వెళ్లాడు. కానీ వాళ్లు మాత్రం అది ఎర్రర్ అని.. జాక్ పాట్ విన్నర్ అతను కాదని తేల్చి చెప్పారు. డబ్బులివ్వం పొమ్మన్నారు. 

దీంతో ఒక్కసారికి షాక్ కు గురయ్యాడా వ్యక్తి. వెంటనే సదరు లాటరీ కంపెనీమీద న్యాయపోరాటానికి దిగాడు. ఇప్పుడిది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  జనవరి 6, 2023న జాన్ చీక్స్ అనే వ్యక్తి పవర్‌బాల్ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. రెండు రోజుల తర్వాత డీసీ లాటరీ వెబ్‌సైట్‌లో పవర్ బాల్ లాటరీ వివరాలు ప్రచురించారు. అందులో చీక్స్ లాటరీ నెం. ఉంది. అది చూసి చీక్స్ ఆశ్చర్యపోయాడని గార్డియన్ నివేదిక తెలిపింది. 

చీక్స్ తన డబ్బును కలెక్ట్ చేసుకోవడానికి  పవర్‌బాల్ డీసీ లాటరీని సంప్రదించగా, వారు అతని నంబర్‌లు పొరపాటున ప్రచురించబడిందని వాదించారు. దీంతో హతాశుడైన చీక్స్ వాదించాడు. కానీ వారు వినలేదు. నిజమైన విజేత వేరే అని తెలిపారు. దీంతో నిజమైన విజేతపై వివాదాస్పద న్యాయ పోరాటానికి దారితీసింది.

గూగుల్ ఉద్యోగికి 300 శాతం వేతనం పెంపు: ఎందుకో తెలుసా?

NBC వాషింగ్టన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, చీక్స్ మాట్లాడుతూ.. "నాకు లాటరీ వచ్చిందని సంతోషంగా ఉన్నాను. కానీ గట్టిగా అరిచి, కేకలు పెట్టలేదు. ఒక స్నేహితుడిని పిలిచాను. అది నిజమేనా కనుక్కున్నాను. అతను చెప్పినట్టే స్క్రీన్ షాట్ ను ఫొటో తీశాను. ఆ తరువాతే నేను నిద్రపోగలిగాను’ అన్నాడు. 

అయితే, లాటరీ మరియు గేమింగ్ (OLG) కార్యాలయానికి అతని టిక్కెట్‌ను తీసుకెళ్లి ఇచ్చిన తరువాత వారు చీక్స్ విజేత అనే దాన్ని ఒప్పుకోలేదు. గార్డియన్ వివరాల ప్రకారం.. చీక్స్ జాక్‌పాట్ దావాను నిర్వాహకులు తిరస్కరించినట్లు కోర్టు పత్రాలు పేర్కొన్నాయి. అతనికి రాసిన లేఖలో, ఓఎల్ జీ నిబంధనల ప్రకారం, ఓఎల్ జీ గేమింగ్ సిస్టమ్ ద్వారా టికెట్ విజేతగా ధృవీకరించబడనందున అతని బహుమతి దావా తిరస్కరించబడిందని వారు వివరించారు.

"క్లెయిమ్ ఏజెంట్లలో ఒకరు నా టికెట్ మంచిది కాదని, దానిని చెత్త డబ్బాలో వేయమని నాకు చెప్పారు" అని చీక్స్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. వెంటనే నేను కోపంగా చూశాను.. అప్పుడాయన అది చెల్లదు. పనికిరాదు.. అందుకే అలా అన్నాను.. అని చెప్పుకొచ్చాడని తెలిపాడు. 

వెంటనే చీక్స్ తన టిక్కెట్‌ను పారేయకూడదనుకున్నాడు. దాన్ని సేఫ్ డిపాజిట్ బాక్స్‌లో ఉంచాడు. పవర్‌బాల్‌పై దావా వేయడానికి న్యాయవాదిని సంప్రదించాడు. చీక్స్ దాఖలు చేసిన దావాలో మల్టీ-స్టేట్ లాటరీ అసోసియేషన్, గేమ్ కాంట్రాక్టర్ టావోటీ ఎంటర్‌ప్రైజెస్‌ను కూడా ప్రతివాదులుగా పేర్కొంది.

అతను ప్రస్తుతం లాటరీ నుండి నష్టపరిహారం కోసం ప్రయత్నిస్తున్నాడు, పవర్‌బాల్ జాక్‌పాట్‌తో పాటు దానిపై అతను సంపాదించే రోజువారీ వడ్డీ మొత్తం 340 మిలియన్ల డాలర్లు అని నివేదిక జోడించింది. చీక్స్ ఇప్పుడు కాంట్రాక్ట్ ఉల్లంఘన, నిర్లక్ష్యం, మానసిక క్షోభను కలిగించడం, మోసం వంటి ఎనిమిది వేర్వేరు కౌంట్ల కోసం దావా వేస్తున్నారు. అతని న్యాయవాది, రిచర్డ్ ఎవాన్స్, విజేత సంఖ్యలు..చీక్స్ నంబర్‌లతో సరిపోలినందున, అతను మొత్తం జాక్‌పాట్‌ను అందుకోవాలని వాదించాడు.

ఈ వ్యాజ్యం లాటరీ కార్యకలాపాల సమగ్రత, జవాబుదారీతనం.. లాటరీల్లో అవకతవకలను ఎత్తి చూపిస్తుందని ఎవాన్స్ అన్నారు. అంతేకాదు, సమస్య కేవలం వెబ్‌సైట్‌లోని సంఖ్యలకు సంబంధించినది కాదని నొక్కిచెప్పారు.ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరగనుంది

Follow Us:
Download App:
  • android
  • ios