Asianet News TeluguAsianet News Telugu

ఫలించిన భారత దౌత్య వ్యూహం.. 8 మంది మాజీ ఇండియన్ నేవీ ఉద్యోగుల మరణశిక్షపై ఖతార్ వెనక్కి

గూఢచర్యం ఆరోపణలపై ఖతార్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది భారత నౌకాదళం మాజీ అధికారులకు ఊరట కలిగింది. మరణశిక్షను జైలు శిక్షగా మారుస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.  ఈ మేరకు ఖతార్‌లోని అప్పీలేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.

Qatar court commutes death sentence of 8 ex-Indian Navy officers ksp
Author
First Published Dec 28, 2023, 5:20 PM IST

గూఢచర్యం ఆరోపణలపై ఖతార్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది భారత నౌకాదళం మాజీ అధికారులకు ఊరట కలిగింది. మరణశిక్షను జైలు శిక్షగా మారుస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.  ఈ మేరకు ఖతార్‌లోని అప్పీలేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.

కాగా..  గత ఏడాది నుంచి ఖతార్‌లో కస్టడీలో ఉన్న ఎనిమిది మంది భారత నేవీ వెటరన్‌లకు అక్క‌డి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం.. ఖతార్ కోర్టు ఆదేశాలను తాము వ్యతిరేకిస్తామని పేర్కొంది. ఈ కేసులో అన్ని చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తామని తెలిపింది. అధికారులు ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేశారనే అభియోగంతో గత ఏడాది ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు.

ఈ తీర్పుకు ముందు, వారి అభ్యర్థనలు అనేకసార్లు తిరస్కరించబడ్డాయ‌నీ, ఖతార్ అధికారులు వారి నిర్బంధాన్ని పొడిగించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ షాకింగ్ తీర్పుపై భారత్ స్పందిస్తూ.. బాధిత‌ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామనీ, ఈ కేసుకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామనీ, దీన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. తాము అన్ని కాన్సులర్, చట్టపరమైన సహాయాన్ని అందిస్తామ‌ని పేర్కొంది.

8 మంది నేవీ వెట‌రన్లు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఎంటీ కేసు..?

ఎనిమిది మంది నేవీ మాజీ అధికారులు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలను అందించే ప్రైవేట్ సంస్థ అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేసేవారు. ఈ కంపెనీ రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ ఖమీస్ అల్-అజ్మీకి చెందినది. అయితే, ఈ ఎనిమిది మంది వ్యక్తులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆగస్టు 30, 2022న అరెస్టు చేసింది. వీరితో పాటు, ఆ సంస్థ యజమాని అజ్మీని గత సంవత్సరం అరెస్టు చేయ‌గా, ఆయ‌న నవంబర్ లోనే విడుద‌ల అయ్యారు. 

సంబంధిత రిపోర్టుల ప్ర‌కారం.. ఖతార్ కు చెందిన స్టెల్త్ జలాంతర్గాములపై ​​ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేసినట్లు వీరిపై అభియోగాలు మోపారు. ఎనిమిది మంది భారతీయ నావికాదళ అనుభవజ్ఞులపై మార్చి 25 న అభియోగాలు నమోదు చేయబడ్డాయి. ఖతార్ చట్టం ప్రకారం వారిని అరెస్టు చేసినప్పటి నుండి వారిని నిర్బంధంలో ఉంచారు. అలాగే, అల్ దహ్రా గ్లోబల్ సంస్థ దోహాలో తన కార్యకలాపాలను మూసివేయవలసి వచ్చింది. అక్క‌డ ప‌నిచేస్తున్న వారిలో చాలా మంది భార‌త పౌరులు స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చారు.

ఈ ఎనిమిది మంది భార‌త మాజీ నేవీ అధికారులు వీరే..

అరెస్టయిన వారిలో కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, నావికుడు రాజేష్ గోపకుమార్‌లతో సహా ఒకప్పుడు ప్రధాన భారత యుద్ధనౌకలకు నాయకత్వం వహించిన అలంకృత అధికారులు ఉన్నారు. వీరంద‌రూ కూడా భారత నౌకాదళంలో 20 సంవత్సరాల వరకు విశిష్ట సేవా రికార్డును కలిగి ఉన్నారు. వారిలో, కమాండర్ పూర్ణేందు తివారీ 2019లో విదేశీ భారతీయులకు అందించే అత్యున్నత పురస్కారమైన ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ను అందుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios