Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక.. ఒమిక్రాన్ వెలుగుచూసిన త‌ర్వాత 5 ల‌క్షల మ‌ర‌ణాలు !

Coronavirus: Omicron చివరి వేరియంట్ కాదు..తదుపరి వేరియంట్ మరింత వ్యాప్తి కలిగించే... ప్రమాదకరమైనవి అయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. అలాగే, క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 5 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయ‌ని పేర్కొంది. 
 

Next Covid variant likely to be more infectious: WHO
Author
Hyderabad, First Published Feb 9, 2022, 10:58 AM IST

Coronavirus:ఇప్ప‌టికీ ప‌లు దేశాల్లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. అయితే, కొన్ని దేశాల్లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండటంతో ఆంక్ష‌లు ఎత్తివేస్తున్నాయి. అయితే, క‌రోనా ప్ర‌భావం ఇంకా త‌గ్గిపోలేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. Omicron చివరి వేరియంట్ కాదు..తదుపరి వేరియంట్ మరింత వ్యాప్తి కలిగించే... ప్రమాదకరమైనవి అయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది

“Omicron మేము మాట్లాడటం మీరు వినే చివరి వేరియంట్ కాదు. ఆందోళ‌న‌కర‌మైన క‌రోనా వేరియంట్లు రూపాంత‌రం చెందుతూనే ఉన్నాయి. తదుపరి రూపాంతరం మరింత  ఆందోళ‌న‌క‌ర‌మైనదిగా ఉండ‌వ‌చ్చు. అంటే.. దాని వ్యాప్తి, వ్యాధి ప్ర‌భావం అధికంగా ఉండే అవ‌కాశం లేక‌పోలేదు. ఇప్పుడు ఉన్న ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ల‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. భవిష్యత్ వేరియంట్‌లు ఎక్కువ లేదా తక్కువ తీవ్రంగా ఉంటాయా లేదా అనేది పెద్ద ప్రశ్న" అని డ‌బ్ల్యూహెచ్‌వో (World Health Organization-WHO) కోవిడ్ -19 టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్‌ఖోవ్ అన్నారు.  కొత్త‌గా రాబోయే కోవిడ్ వేరియంట్లు ప్ర‌స్తుతం ఉన్న టీకాల‌ను త‌ట్టుకునే.. రోగ‌నిరోధ‌క శ‌క్తిని క్షీణింప‌జేసే ర‌కాలుగా ఉండ‌వ‌చ్చు. అలాంటి ప‌రిస్థితులు ఉండ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నామ‌ని తెలిపారు. 

అలాగే, ప్ర‌స్తుతం క‌రోనా మ‌ర‌ణాలు పెరుగుతుండ‌టంపై  డ‌బ్ల్యూహెచ్‌వో (World Health Organization-WHO)  ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేర‌కియంట్ త‌ర్వాత మ‌ర‌ణాలు క్ర‌మంగా పెరిగాయ‌ని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ కనుగొనబడినప్పటి నుండి సుమారు  ఐదు ల‌క్ష‌ల (5,00,000) కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయ‌ని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ గణనను "విషాదకరమైనది" అని పేర్కొంది. గ్లోబల్ హెల్త్ బాడీ ఇన్సిడెంట్ మేనేజర్ అబ్ది మహముద్ మాట్లాడుతూ.. నవంబర్ చివరిలో ఓమిక్రాన్ ఆందోళనకరమైన వైవిధ్యంగా ప్రకటించబడినప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 130 మిలియన్ కేసులు, 500,000 మరణాలు నమోదయ్యాయి అని తెలిపారు. 

Omicron వేరియంట్‌లు తక్కువ తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇది డెల్టాను ప్రపంచ ఆధిపత్య కోవిడ్ వేరియంట్‌గా వేగంగా అధిగమించింది, ఎందుకంటే ఇది మరింత వ్యాప్తి చెందుతున్న‌ద‌ని అని మహమూద్  అన్నారు. “సమర్థవంతమైన వ్యాక్సిన్‌ల యుగంలో, అర ​​మిలియన్ల మంది ప్రజలు మరణించారు. ఇది నిజంగా విషాదం. అందరూ Omicron తేలికపాటిదని చెబుతున్నప్పుడు.. ఒమిక్రాన్ ను  గుర్తించినప్పటి నుండి అర మిలియన్ల మంది మరణించారు. ఇది విషాదానికి మించినది” అని ఆయ‌న పేర్కొన్నారు. ఇదిలావుండ‌గా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 401,176,794 కోవిడ్ కేసులు, 5,782,794 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, యూకే, రష్యా, టర్కీ, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, అర్జెంటీనా, ఇరాన్, కొలంబియా దేశాలు టాప్ లో ఉన్నాయి.  ఒక్క అమెరికాలోనే 78,556,193 కరోనా కేసులు, 932,443 మరణాలు నమోదయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios