Asianet News TeluguAsianet News Telugu

Killer Nurse: నర్సు కాదు నరరూప రాక్షసి.. 760 ఏళ్ల జైలు శిక్ష.. అసలు ఏం జరిగింది? 

Killer Nurse: అత్యంత పవిత్రమైన నర్స్ వృత్తికి ఓ మహిళ కళంకం తెచ్చింది. గత మూడేళ్లలో దాదాపు 17 మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.

Killer Nurse Pennsylvania nurse sentenced to jail for over 700 years for killing 17 patients KRJ
Author
First Published May 7, 2024, 7:00 PM IST

Killer Nurse: మనకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా హడావుడిగా ఆస్పత్రులకు పరిగెత్తుతూ ఉంటాం. ఆస్పత్రిని దేవాలయంగా భావిస్తాం. అంతే కాదు అక్కడ  పనిచేసి వైద్యం అందించే వైద్యసిబ్బందిని దేవుళ్లు, దేవతల్లా భావిస్తాం. తమవారు ఆరోగ్యం బాగుపడితే వైద్యులకు, అక్కడి సిబ్బందికి చేతులెత్తి మొక్కుతాం. కానీ అలాంటి వృత్తిలో ఉన్నవారే యమకింకరులైతే. ప్రాణాలు కాపాడుకునేందుకు వచ్చిన వాళ్ల ప్రాణాలను తీసేస్తే. ఆలోచిస్తేనే షాకింగ్ గా ఉంది కదూ.

కానీ అది నిజం ఓ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ నర్స్ ప్రాణాలు పోయడం మానేసి ప్రాణాలను హరిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు కేవలం 3 సంవత్సరాల్లోనే వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తూ ఏకంగా 17 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఇంతటి దారుణమైన సంఘటన ఎక్కడ జరిగిందో ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

అమెరికాకు చెందిన  41 ఏళ్ల హెదర్ ప్రెస్డీ నర్సుగా విధులు నిర్వహిస్తూ తన వృత్తికి ద్రోహం చేసింది. తాను విధులు నిర్వహించిన ఆస్పత్రుల్లో ఎవరినో ఒకరిని టార్గెట్‌ చేసి వాళ్లని మృత్యువు ఒడిలోకి చేరుస్తూ వచ్చింది. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 మందికి మితిమీరిన ఇన్సులిన్ డోస్ ఇచ్చి మృత్యు ఒడిలోకి చేర్చింది. ఆమె ఇన్సులిన్ ఇచ్చిన వారిలో కొందరికి షుగర్ కూడా లేదని సమాచారం. 

ఈ కేసులో అమెరికా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 17 మందిని పొట్టన పెట్టుకున్న ఆమెకు 700 సంవత్సరాల జైలుశిక్షను వేసింది. అనంతరం అమెరికా మీడియా తెలిపిన వివరాల్లోకెళితే ఇప్పటికే ఆ నర్సు పై పలు హత్యకేసులు, హత్యాయత్నం కేసులు ఉన్నట్టు తెలిపాయి. నైట్‌షిఫ్ట్‌ సమయంలో ఎవరూ లేని టైంచూసి ఇంతటి ఘోరానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. హైడోస్ ఇన్సులిన్ తీసుకున్న మృతుల్లో 43 సంవత్సరాల నుంచి మొదలుకుని 104 సంవత్సరాల వయసున్న వారు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios