Asianet News TeluguAsianet News Telugu

ఐస్‌లాండ్ అగ్నిపర్వతం బద్దలు.. జనావాసాల్లోకి లావా, కాలిబూడిదవుతున్న ఇళ్లు...

అగ్నిపర్వతం బద్దలైతే తమ ఇళ్లకు ముప్పు వాటిళ్లవచ్చనే  ఆందోళనతో ముందుగానే స్థానికులు ఒక ఎత్తైన గుట్టను నిర్మించుకున్నారు. కానీ, అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ఆ గుట్టను దాటుకుని ఊళ్లోకి ప్రవేశించింది.

Iceland volcano eruption spills lava into town setting houses on fire - bsb
Author
First Published Jan 16, 2024, 6:55 AM IST

గ్రిండావిక్ ఐస్‌లాండ్ లో అగ్నిపర్వతం బీభత్సం సృష్టిస్తోంది. రెక్జానెస్  ద్వీపకల్పంలో ఆదివారం నాడు అగ్నిపర్వతం బద్దలైంది. ఈ  బద్దలైన అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా అగ్నిపర్వతం సమీపంలోని  గ్రిండావిక్ ప్రాంతానికి చేరుకోవడంతో… అక్కడున్న ఇండ్లు ఖాళీ  బూడిదయ్యాయి. ఈ మేరకు ఐస్‌లాండ్ ప్రధాని కాట్రిన్ జాకోబ్స్ డోట్టిర్  ధ్రువీకరించారు. గ్రిండావిక్ కు ఈరోజు చీకటి దినంగా అభివర్ణించారు. ఈ ప్రాంతంలోని స్థానికులు కలిసికట్టుగా పనిచేసే ముప్పు నుంచి బయటపడాలని సూచించారు.

ఈ అగ్నిపర్వతానికి సంబంధించి స్థానికులకు భయాందోళనలు ఎప్పటినుంచో ఉన్నాయి. అగ్నిపర్వతం బద్దలైతే తమ ఇళ్లకు ముప్పు వాటిళ్లవచ్చనే  ఆందోళనతో ముందుగానే స్థానికులు ఒక ఎత్తైన గుట్టను నిర్మించుకున్నారు. కానీ, అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ఆ గుట్టను దాటుకుని ఊళ్లోకి ప్రవేశించింది. ఇల్లు కాలిపోతుండడం ఎటు చూసినా లావా ప్రవహిస్తుండడంతో.. స్థానికులు ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు తమతో పాటు పెంపుడు జంతువులు, పశువులను కూడా తీసుకెళ్తున్నారు. వీరికి ప్రధాన జీవనాధారం చేపలవేటే. ఈ ఘటన నేపథ్యంలో ఐస్‌లాండ్ లోని పర్యాటక ప్రాంతమైన బ్లూలాగున్ ను జనవరి 16 వరకు మూసివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. లావా వ్యాపిస్తున్న ప్రదేశానికి ఈ ప్రాంతం చాలా దూరంలో ఉందని.. అయినా కూడా ముందు జాగ్రత్తగా బుకింగ్స్ ను నిలిపివేసింది.

నెల రోజుల వ్యవధిలోనే ఈ ఐస్‌లాండ్ లో అగ్నిపర్వతం రెండోసారి బద్దలైంది. నవంబర్లో ఈ ప్రాంతంలో గంటల వ్యవధిలోనే 800సార్లు భూమి కనిపించింది. గ్రిండావిక్ దగ్గర అగ్నిపర్వతం గత నెలలో కూడా బద్దలైంది.  అయితే లావా ఇంతలా ఉబికి రాలేదు. అప్పుడు జనావాసాలు సురక్షితంగా ఉన్నాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios