Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: కరోనాతో 6,242,493 మంది మృతి.. మళ్లీ కొత్త వేరియంట్ల పంజా.. !

Coronavirus: క‌రోనా వైర‌స్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ప్ర‌పంచ దేశాల్లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 6,242,493 మంది క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కొత్త వేరియంట్ల విజృంభ‌ణ ఆందోళ‌న క‌లిగిస్తోంది. 
 

Global Covid caseload tops 509.1 million; New coronavirus variants spreading
Author
Hyderabad, First Published Apr 24, 2022, 4:55 PM IST

Global Covid cases: ప‌లు దేశాల్లో క‌రోనా వైరస్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా కొత్త వేరియంట్లు పుట్టుకురావ‌డం.. అవి ఇప్పటివ‌ర‌కు వెలుగుచూసిన వేరియంట్ల కంటే అత్యంత వేగంగా వ్యాపించే.. ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్లుగా అంచ‌నాలు ఉండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కార‌ణంగా ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది చ‌నిపోగా, కోట్లాది మంది అనారోగ్యానికి గుర‌య్యారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం క‌రోనా డాష్ బోర్డు వివ‌రాల ప్ర‌కారం.. ఇప్ప‌టివ‌ర‌కుప్ర‌పంచ వ్యాప్తంగా 509.1 మిలియన్ల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 6.24 మిలియన్ల మంది చ‌నిపోయారు. 

ఆదివారం ఉదయం యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSSE) ప్రస్తుత గ్లోబల్ కాసేలోడ్, మరణాల సంఖ్య వరుసగా 509,166,036 మరియు 6,216,725గా ఉందని వెల్లడించింది.  అయితే మొత్తం టీకా మోతాదుల సంఖ్య 11,233,194,944కి పెరిగింది. CSSE ప్రకారం ప్రపంచంలో అత్యధిక కేసులు మరియు మరణాలు అమెరికాలో న‌మోద‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో మొత్తం 80,971,925 క‌రోనా వైరస్ కేసులు న‌మోదుకాగా, 991,231 మంది మ‌రణించారు. అమెరికా త‌ర్వాత క‌రోనా వైర‌స్ కేసులు అత్య‌ధికంగా భార‌త్ లో న‌మోద‌య్యాయి. భార‌త్ లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,30,57,545 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. వైర‌స్ తో పోరాడుతూ.. 5,22,193 మంది చ‌నిపోయారు. గ‌త కొంత కాలంగా త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా ప్ర‌భావం భార‌త్ లో మ‌ళ్లీ పెరుగుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా కేసులు నమోదవుతున్న ఇతర దేశాలు ఇలా ఉన్నాయి...  బ్రెజిల్ (30,345,808) ఫ్రాన్స్ (28,435,100), జర్మనీ (24,180,512), UK (22,106,306), రష్యా (17,864,332), దక్షిణ కొరియా (16,895,194), ఇటాలియన్, 69,190,6971 స్పెయిన్ (11,736,893) , వియత్నాం (10,554,689) లు టాప్ లో ఉన్నాయి. అలాగే, 100,000 కంటే ఎక్కువ మంది క‌రోనా వైర‌స్ తో చ‌నిపోయిన దేశాలు వ‌రుస‌గా.. బ్రెజిల్ (662,855), భారతదేశం (522,116), రష్యా (367,203), మెక్సికో (324,033), పెరూ (212,724), UK (173,985), ఇటలీ (162,160), ఇండోనేషియా (162,1560) , ఫ్రాన్స్ (146,057), ఇరాన్ (140,952), కొలంబియా (139,771), జర్మనీ (134,179), అర్జెంటీనా (128,344), పోలాండ్ (115,948), స్పెయిన్ (103,721) మరియు దక్షిణాఫ్రికా (100,298) టాప్ లో ఉన్నాయి. 

క‌రోనా వెలుగుచేసిన‌ప్ప‌టి నుంచి చైనాకు ఎదురుకాని ప‌రిస్థితులు అక్క‌డ ప్ర‌స్తుతం నెల‌కొన‌డం రాబోయే క‌రోనా కొత్త వేవ్ ల ప్ర‌మాదాన్ని సూచిస్తున్న‌ద‌ని నిపుణులు, విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  చైనాలో గ‌తంలో కంటే ప్ర‌స్తుతం రికార్డు స్థాయ‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ క్రమంలోనే అక్క‌డి ప్ర‌భుత్వం క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. క‌రోనా వ్యాప్తి ఆగ‌క‌పోవ‌డంతో లాక్‌డౌన్ ఆంక్ష‌లు విధించింది. దేశంలోని అనేక న‌గ‌రాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. కోవిడ్‌-19 నేప‌థ్యంలో క‌ఠినమైన లాక్డౌన్ చర్యలు, సరఫరా గొలుసుల విచ్ఛిన్నం, ఆహార కొరత, నిత్యావ‌స‌రాలు కూడా అందుబాటులో లేకుండా లాక్‌డౌన్ విధించ‌డం ప్ర‌జ‌ల‌కు శాపంగా మారింది. దీంతో లాక్‌డౌన్ లో ఉన్న ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మ‌టించే ప‌రిస్థితులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. అయితే, ప్ర‌జ‌ల ఆగ్ర‌హం, నిర‌స‌న‌, అసంతృప్తిని చైనా స‌ర్కారు ఎంత‌గా అణ‌చివేయాల‌ని చూస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఆ దేశ ఆర్థిక కేంద్రమైన షాంఘై నివాసితులు ఆన్‌లైన్‌లో త‌మ కోపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల కార‌ణంగా తాము ప‌డుతున్న ఇబ్బందుల గురించి చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios