Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: క‌రోనా క‌ల్లోలం.. మ‌ళ్లీ మొద‌లైంది !

Coronavirus: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ మ‌ళ్లీ మొద‌లైంది. ప్ర‌పంచవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 467.6 మిలియన్ల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 6.07 మిలియన్లకు పైగా మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. 
 

Global Covid caseload tops 467.6 million: Johns Hopkins University
Author
Hyderabad, First Published Mar 19, 2022, 11:09 AM IST

Coronavirus: గ‌త మూడు నెల‌లుగా క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే, ప్ర‌స్తుతం మ‌ళ్లీ చాలా దేశాల్లో క‌రోనా విజృంభ‌ణ మొద‌లైంది. దీంతో ప్ర‌పంచ దేశాల‌తో పాటు డ‌బ్ల్యూహెచ్‌వో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది.  జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం.. ప్ర‌పంచవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 467.6 మిలియన్ల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 6.07 మిలియన్లకు పైగా మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. టీకాలు తీసుకున్న వారి సంఖ్య 10.77 బిలియన్లకు పెరిగింది. 

శనివారం ఉదయం జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSSE) ప్రస్తుత గ్లోబల్ వెల్ల‌డించిన క‌రోనా కేసుల వివ‌రాల ప్ర‌కారం.. అన్ని దేశాల్లో క‌లిపి 467,671,421 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మ‌ర‌ణాల సంఖ్య 6,070,281కి పెరిగింది. అయితే మొత్తం టీకా మోతాదుల సంఖ్య 10,772,862,372కి పెరిగింది. ప్ర‌పంచంలో అత్య‌ధికంగా క‌రోనాతో ప్ర‌భావిత‌మైన దేశంగా అమెరికా నిలిచింది. ఆ త‌ర్వాతి స్థానంలో బ్రెజిల్, భార‌త్ లు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో 79,717,219  క‌రోనావైర‌స్ కేసులు, 970,804 మ‌ర‌ణాలు న‌మోదయ్యాయి. 

అమెరికా త‌ర్వాత క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన దేశాల్లో భారతదేశం (43,004,005 కేసులు, 516,281 మరణాలు), బ్రెజిల్ (29,584,800 ఇన్ఫెక్షన్లు, 657,098 మరణాలు) ఉన్నాయి. 10 మిలియన్లకు పైగా కేసులు నమోదైన ఇతర దేశాలు ఫ్రాన్స్ (24,143,852), UK (20,243,664), జర్మనీ (18,412,185), రష్యా (17,264,828), టర్కీ (14,663,508), ఇటలీ (13,724,411), Spain (7,31,61,2016) దేశాలు ఉన్నాయి. 

100,000 కంటే ఎక్కువ మంది  క‌రోనా తో చ‌నిపోయిన దేశాలు రష్యా (356,327), మెక్సికో (321,806), పెరూ (211,691), UK (164,099), ఇటలీ (157,607), ఇండోనేషియా (153,411), ఫ్రాన్స్ (141,839), I41,839) , కొలంబియా (139,415), అర్జెంటీనా (127,439), జర్మనీ (126,686), పోలాండ్ (114,087), ఉక్రెయిన్ (112,459), స్పెయిన్ (101,703)లు ఉన్నాయి. 

అయితే, ప్ర‌స్తుతం చాలా దేశాల్లో నిత్యం ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా క‌రోనా క‌ట్ట‌డి కోసం కట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న చైనాలోనూ క‌రోనా విజృంభ‌ణ మ‌ళ్లీ మొద‌లైంది. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ద‌క్షిణ కోరియాలోనూ ఆందోళ‌న‌క‌ర స్థాయిలో వైర‌స్ వ్యాప్తి జ‌రుగుతోంది. 

కాగా, భార‌త్ లో గ‌త 24 గంటల్లో కొత్త‌గా  2075 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే,  71 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 4,30,04,005కు చేరాయి. మ‌ర‌ణాలు  5,16,352కు పెరిగాయి. మొత్తం కేసుల్లో 4,24,61,926 మంది బాధితులు కోలుకోగా, 27,802 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్ లు టాప్ లో ఉన్నాయి. ఒక్క మహారాష్ట్ర లోనే 78,72,203 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 1,43,765 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios