Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: ప్ర‌పంచ‌వ్యాప్తంగా 414 మిలియ‌న్ల క‌రోనా కేసులు.. ఎంత‌మంది చ‌నిపోయారంటే..?

Coronavirus: యావ‌త్ ప్ర‌పంచాన్ని ఇప్ప‌టికీ క‌రోనా మ‌హ‌మ్మారి గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న‌ది.  చాలా దేశాల్లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు అన్ని దేశాల్లో క‌లిపి 414,012,202 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 5,844,949 మంది కోవిడ్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 

Global Covid caseload tops 413.3 million
Author
Hyderabad, First Published Feb 15, 2022, 10:54 AM IST

Coronavirus: ఇప్ప‌టికీ ప‌లు దేశాల్లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా (Coronavirus) మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. గ‌త నెల రోజులతో పోలిస్తే..  క‌రోనా బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. అయితే, ఇప్ప‌టికీ.. ప‌లు దేశాల్లో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన డెల్టా వేరియంట్‌, అత్యంత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌భావం కొన‌సాగుతున్న‌ది. మ‌రీ ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ స‌బ్ వేరియంట్ల గురించి ఇంకా పూర్తి స‌మాచారం తెలియ‌క‌పోవ‌డంతో మున్ముందు ఎలాంటి ప్ర‌భావం చూతుంద‌నే దానిపై ప‌రిశోధ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లో న‌మోదైన క‌రోనా వైర‌స్ (Coronavirus) వివ‌రాలు గ‌మ‌నిస్తే.. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 414,012,202  క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి.  ఇదే స‌మ‌యంలో వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,844,949కి పెరిగింది. మొత్తం కేసుల్లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 336,051,813 మంది కోలుకున్నారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా అత్య‌ధికంగా ప్రభావిత‌మైన దేశం అమెరికా. అగ్ర‌రాజ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 79,520,665 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇదే స‌మ‌యంలో క‌రోనాతో (Coronavirus) ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 946,180కి పెరిగింది. 

అమెరికా త‌ర్వాత క‌రోనా (Coronavirus) కార‌ణంగా అత్య‌ధికంగా ప్ర‌భావిత‌మైన రెండో దేశం భార‌త్. మ‌న దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,26,92,943  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇదే స‌మ‌యంలో 5,09,358 మంది క‌రోనా వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితం వ‌ర‌కు భార‌త్ లో నిత్యం ల‌క్ష‌ల్లోనే కొత్త కేసులు న‌మోద‌య్యాయి. అయితే, గ‌త 24 గంట‌ల్లో కొత్త కోవిడ్‌-19 (Coronavirus) కేసులు 30 వేల దిగువ‌కు ప‌డిపోయాయి.  మ‌ర‌ణాలు సైతం స‌గానికి త‌గ్గిపోయాయి. మొత్తం క‌రోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 4,17,60,458 కి పెరిగింది.దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ లు టాప్ లో ఉన్నాయి. 

ప్ర‌పంచ‌వ్యాప్తం క‌రోనా (Coronavirus) కేసులు అధికంగా న‌మోదైన దేశాల జాబితాలో అమెరికా, భార‌త్‌, బ్రెజిల్‌, ఫ్రాన్స్, యూకే, ర‌ష్యా, ట‌ర్కీ, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, స్పెయిన్‌, అర్జెంటీనా, ఇరాన్ దేశాలు ఉన్నాయి. జ‌పాన్‌, సౌత్ కొరియాలు స‌హా యూర‌ప్ లోని ప‌లు దేశాల్లో ప్ర‌స్తుతం క‌రోనా (Coronavirus) కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. బ్రెజిల్ లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 27,541,131 క‌రోనా కేసులు, 638,913 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ఫ్రాన్స్ లో 21,735,302 కేసులు, 135,189 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. నాల్గో స్థానంలో ఉన్న యూకేలో 18,348,029 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అలాగే, 159,605 మంది చ‌నిపోయారు. ర‌ష్యాలో అయితే, 14,313,965 మందికి క‌రోనా (Coronavirus) సోక‌గా, వారిలో 340,931 ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో  ఆయా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios