Asianet News TeluguAsianet News Telugu

మిస్ వరల్డ్ 2024: చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవాకు కిరీటం

మిస్ వరల్డ్ 2024 కిరిటాన్ని   చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా  ఫిస్కోవా దక్కించుకున్నారు.

Czech Republic's Krystyna Pyszkova Wins Miss World 2024 lns
Author
First Published Mar 10, 2024, 6:44 AM IST

ముంబై:మిస్ వరల్డ్ గా  చెక్ రిపబ్లిక్ సుందరి  క్రిస్టినా ఫిస్కోవా దక్కించుకున్నారు. శనివారంనాడు  ముంబైలో జరిగిన ఫైనల్స్ పోటీల్లో మిస్ వరల్డ్ కిరిటాన్ని  చెక్ రిపబ్లిక్ సుందరి దక్కించుకున్నారు.భారత్ కు చెందిన  సిని శెట్టి టాప్ 8వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.మిస్ లెబనాన్ యాస్మినా జైటౌన్  మొదటి రన్నరప్ గా నిలిచారు.పోలాండ్ కు చెందిన ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్కా  మిస్ వరల్డ్ కిరిటాన్ని  క్రిస్టినా ఫిస్కోవాకు  అందించారు.

also read:వలసలపై ఫోకస్, రెండో జాబితాపై కసరత్తు:కిషన్ రెడ్డికి హైకమాండ్ పిలుపు

చెక్ రిపబ్లిక్ కు రెండో దఫా మిస్ వరల్డ్ కిరిటం దక్కింది.  2006లో  చెక్ రిపబ్లిక్ కు చెందిన టాటానా కుచరోవా ప్రపంచ సుందరిగా ఎంపికయ్యారు.  మిస్ వరల్డ్  వెబ్ సైట్ ప్రకారంగా పిస్కోవా చెక్ మోడల్. ఆమె లా, బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్లలో వేర్వేరు డిగ్రీలను అభ్యసిస్తున్నారు.

టాంజానియాలో నిరుపేద పిల్లల కోసం ఆంగ్లపాఠశాలను ప్రారంభించారు. వేణువు,వయోలిన్ వాయించనున్నారు.  ఆర్ట్ అకాడమీలో తొమ్మిదేళ్లు గడిపిన ఆమెకు కళలపై ఉన్న మక్కువను చూపుతుందని వెబ్ సైట్ చెబుతుంది.28 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు  భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది.  భారత్ తరపున శెట్టి ప్రాతినిథ్యం వహించారు.2022లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరిటాన్ని శెట్టి దక్కించుకున్నారు.  

also read:ఎన్‌డీఏలోకి తెలుగుదేశం: ఆహ్వానించిన బీజేపీ, త్వరలో అధికారిక ప్రకటన?

మిస్ వరల్డ్ టైటిల్ ను భారత్ ఆరు దఫాలు దక్కించుకుంది.  రీటా ఫరియా పావెల్ 1966లో తొలిసారిగా ఈ కిరిటం పొందారు. 1994లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, 1997లో  డయానా మేడేన్, 1999లో యుక్తాముఖీ,  2000లో ప్రియాంక చోప్రా జోనాస్, 2017లో  మానుషి చిల్లర్  మిస్ వరల్డ్  కిరిటం దక్కించుకున్నారు.

also read:ప్రపంచంలో పొడవైన సేలా టన్నెల్: ప్రారంభించిన మోడీ

112 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొన్న 71వ మిస్ వరల్డ్  పోటీలు బీకేసీలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి.మిస్ వరల్డ్  పోటీల్లో  12 మంది జడ్జిలుగా వ్యవహరించారు.  ఈ జడ్జిల ప్యానెల్ లో  నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా ఉన్నారు.కృతిసనన్, పూజా హెగ్డే, క్రికెటర్ హర్బజన్ సింగ్, రజత్ శర్మ, అమృత ఫడ్నవీస్,  వినీత్ జైన్ , బెన్నెట్,  జూలియా మోర్లీ, మిస్ వరల్డ్  సీఈఓ జమీల్ సైది, మాజీ మిస్ వరల్డ్  చిల్లార్ తో పాటు మరో ముగ్గురు మాజీ మిస్ వరల్డ్ లు జడ్జిలుగా వ్యవహరించారు.

also read:కజిరంగ నేషనల్ పార్క్‌లో కలియదిరిగిన మోడీ: ఏనుగు సవారీ (ఫోటోలు)

చిత్ర నిర్మాత కరణ్ జోహార్, మాజీ ప్రపంచ సుందరి మేగాన్ యంగ్ ఈవెంట్ ను హోస్ట్ చేశారు.  గాయకులు షాన్, నేహా కక్కర్, టోని కక్కర్ ల ప్రదర్శనతో  ఈ పోటీ ప్రారంభమైంది.మిస్ వరల్డ్ పోటీకి సంబంధించిన ట్యాగ్ లైన్ బ్యూటీ విత్ పర్సన్ ప్రాముఖ్యతను తెలుపుతూ చోప్రా జోనాస్ చేసిన వీడియో సందేశం కూడ ఈవెంట్ లో ప్లే చేశారు.

ఫిబ్రవరి  20న న్యూఢిల్లీలోని ఇండియా టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఐటీడీసీ) చే  ది ఓపెనింగ్ సెర్మనీ, ఇండియా వెల్కస్ ది వరల్డ్ గాలా తో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios