Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: త‌గ్గ‌ని క‌రోనా ప్ర‌భావం.. డ‌బ్లూహెచ్‌వో ఏం చెప్పిందంటే..?

Coronavirus: క‌రోనా వైరస్ ప్ర‌భావం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి త‌న రూపుమార్చుకంటూ అత్యంత ప్ర‌మాద‌కారిగా మారుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. 
 

Coronavirus still a global health emergency : WHO
Author
Hyderabad, First Published Apr 14, 2022, 10:29 AM IST

World Health Organisation : 2019లో చైనాలో మొద‌టిసారి వెలుగుచూసిన క‌రోనా మ‌హ‌మ్మారి త‌క్కువ కాలంలోనే యావ‌త్ ప్ర‌పంచాన్ని చుట్టుముట్టి ల‌క్ష‌లాది మంది ప్రాణాలు తీసుకుంది. కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేసింది.  అయితే, గ‌తంలో పోలిస్తే ప్ర‌స్తుతం క‌రోనా మ‌ర‌ణాలు త‌గ్గుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. కేసులు కూడా త‌క్కువ‌గానే ఉన్నాయి. కానీ చైనా, ద‌క్షిణ కొరియా, ద‌క్షిణాఫ్రికా, ప‌లు యూర‌ప్ దేశాల్లో కోవిడ్ కేసులు మ‌ళ్లీ గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు కొత్త వేరియంట్ల‌ను పుట్టుకురావ‌డం ప్ర‌పంచ దేశాల‌ను మ‌ళ్లీ క‌ల‌వ‌రానికి గురిచేస్తున్న‌ది. కొత్త వేరియంట్లు ఇదివ‌ర‌క‌టి వాటి కంటే రెట్టింపు వేగంతో వ్యాప్తి చెంద‌డంతో పాటు వ్యాధి ప్ర‌భావం అధికంగా ఉంటుంద‌నే అంచ‌నాలు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ప‌లు దేశాలు కోవిడ్ ప్ర‌భావం త‌గ్గింద‌ని నిర్ల‌క్ష్యంగా ఉండ‌ట‌టం కూడా పెనుప్ర‌మాదానికి కార‌ణమ‌య్యే అవ‌కాశ‌ముంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 

ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల‌పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  చాలా దేశాల్లో కొత్త కోవిడ్ -19 కేసులు, మరణాల సంఖ్య తగ్గుతూనే ఉంది కానీ ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పాండ‌మిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ తొల‌గిపోలేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొంది.  ప్ర‌స్తుతం కొత్త వేరియంట్లు పుట్టుకురావ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యమని తెలిపింది. ఎప్పిటిక‌ప్పుడు క‌రోనా వేరియంట్ల‌పు త‌మ ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయ‌నీ, ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తూనే ఉన్నామ‌ని వెల్ల‌డించింది. మున్ముందు క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తే.. దానికి త‌గ్గ‌ట్టుగా చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ప్ర‌పంచ దేశాలు సిద్ధంగా ఉండాల‌ని సూచించింది. ప్ర‌స్తుతం ఉప‌శ‌మ‌నం క‌లిగించే అంశాల్లో కోవిడ్-19 మ‌ర‌ణాలు త‌గ్గ‌టం ఒక‌ట‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల‌ల్టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్  అన్నారు. క‌రోనావైర‌స్‌ మహమ్మారి ప్రారంభ రోజులతో పోలిస్తే గత వారం మొద‌టి నుంచి కోవిడ్ మ‌ర‌ణాలు త‌గ్గాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) వివ‌రాల ప్ర‌కారం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌త మూడు వారాలుగా క‌రోనా వైర‌స్ కొత్త కేసులు, మరణాల త‌గ్గుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 4-10 వారంలో కూగా కోవిడ్ మ‌రణాలు త‌క్కువ‌గానే న‌మోద‌య్యాయి. ఈ స‌మ‌యంలో 7 మిలియన్లకు పైగా కేసులు మరియు 22,000 మరణాలు నమోదయ్యాయి. అంత‌కు ముందువారంతో పోలిస్తే గ‌ణ‌నీయంగా త‌గ్గుద‌ల చోటుచేసుకుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో కోవిడ్‌-19 గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే, కొన్ని దేశాల్లో మాత్రం కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ‌నీ, ఇది ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌ని తెలిపింది. క‌రోనా కేసులు త‌క్కువ‌గా న‌మోదుకావడానికి టెస్టింగ్ రేటు త‌క్కువ‌గా ఉండ‌టం కూడా కార‌ణంగా ఉంద‌ని పేర్కొంది. ఎప్ప‌టిప్పుడు ప్ర‌పంచ దేశాలు క‌రోనా విష‌యంలో అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. కోవిడ్ ప‌రీక్ష‌లు పెంచాల‌ని పేర్కొంది

WHO  కోవిడ్-19 ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ (2005) ఎమర్జెన్సీ కమిటీ తన తాజా సమావేశం అనంత‌రం సిఫార్సులను బుధవారం విడుదల చేసింది. దీని ప్ర‌కారం..  కోవిడ్-19 మహమ్మారి అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా కొనసాగుతుందని సమర్థించింది. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే ఇంకా కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ముగియ‌లేద‌ని సూచిస్తున్నాయ‌ని తెలిపింది.  క‌రోనా బారిన‌ప‌డ్డ‌వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌నీ, కోవిడ్ టీకాల‌ను అందించ‌డంలో వేగం పెంచాల‌ని సూచించింది. మున్ముందు క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తే.. దానిని ఎదుర్కొనే విధంగా సిద్ధం కావాల‌ని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios