గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి: డబ్ల్యుహెచ్ఓ కి సైంటిస్టులు లేఖ

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని, కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలిపే మార్గదర్శకాలను మార్చాలని ప్రపంచంలోని 32 దేశాలకు చెందిన 230 మంది పైచిలుకు సైంటిస్టులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసారు. 

Coronavirus Is Airborne, Says Scientists And Ask WHO To Revise The Rules

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూ వస్తుంది. కానీ కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని, కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలిపే మార్గదర్శకాలను మార్చాలని ప్రపంచంలోని 32 దేశాలకు చెందిన 230 మంది పైచిలుకు సైంటిస్టులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసారు. 

కరోనా వైరస్ బారినపడ్డ వ్యక్తి దగ్గినప్పుడు, లేదా తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ ఇప్పుడు గాలిద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి ఆధారాలున్నాయని, అందుకు అనుగుణంగా మార్పులు చేయాలనీ ఈ సైంటిస్టులు ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరారు. 

తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు ఎలాగో ఒకలాగా ఈ ఆ వైరస్ అయితే గాలిద్వారా ప్రయాణిస్తుంది కదా, ఒక రూమ్ మొత్తం అయితే వ్యాపిస్తుంది కదా అని సదరు సైంటిస్టులు ఒక ఆంగ్ల పత్రికకు చెప్పారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్ధమాత్రం వెంటనే ఈ విషయం పై స్పందించడానికి నిరాకరించింది.  కరోనా మహమ్మారి రోజు రోజుకీ వికృత రూపం దాలుస్తోంది. భారత్ లో ఈ వైరస్  ప్రభావం పెరిగిపోతోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త  కోవిడ్ కేసులు నమోదౌతున్నాయి.  ఇక తాజాగా నమోదైన కేసులతో భారత్ రష్యాను అధిగమించి అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో మూడో స్థానానికి చేరింది. 

ఇకపోతే చికిత్సకు సంబంధించి యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) తో చేస్తున్న ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 

హైడ్రాక్సీక్లోరోక్విన్ తో పాటు హెచ్ఐవీ మందులు లోపినావిర్-రిటోనావిర్ తో చేస్తున్న ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా డబ్ల్యుహెచ్ఓ ప్రకటించింది. 

కరోనా రోగులపై ఈ ఔషధాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తున్నాయో కొంత కాలంగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగాల ఫలితాలు ఇటీవల వచ్చాయి.  ఆయా ఔషధాల ప్రభావం అంతి తక్కువగా ఉన్నట్టుగా డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది. దీంతో ఈ మందులను కరోనా రోగులపై ప్రయోగించడం మానివేయాలని సూచించింది.

ఈ మందులు కరోనా రోగుల మరణాలను తగ్గించడంలో అతి తక్కువ ఫలితాలను చూపిందని డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది. తాను కూడ హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకొన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.ఈ మందు వేసుకొన్న తర్వాత తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆయన తెలిపారు.

కరోనా నివారణకు గాను వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇండియాకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ మనుషులపై కోవాక్సిన్  ప్రయోగాలు ప్రారంభించనుంది. దేశంలోని 12 సెంటర్లలో మనుషులపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios