Asianet News TeluguAsianet News Telugu

భారత్‌తో గొడవ : ఎక్కువ మంది పర్యాటకులను పంపండి.. చైనాను కోరిన మాల్దీవుల అధ్యక్షుడు

"ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం ఎఫ్టీఏ లక్ష్యం, ముఖ్యంగా చైనాకు చేపల ఉత్పత్తులను ఎగుమతి చేయడం ఎఫ్టీఏ ద్వారా మాకు కీలకమైన ప్రాధాన్యత" అని ఆయన చెప్పారు.

Conflict with India : Send more tourists, Maldives President Urges China - bsb
Author
First Published Jan 10, 2024, 8:41 AM IST

బీజింగ్ : భారత ప్రధాని నరేంద్ర మోదీపై తమ మంత్రుల అవమానకరమైన వ్యాఖ్యలపై దౌత్యపరమైన వివాదం చెలరేగడంతో, భారతీయ పర్యాటకులు మాల్దీవులకు రిజర్వేషన్లను రద్దు చేసిన నేపథ్యంలో, ఎక్కువ మంది పర్యాటకులను తమ దేశానికి పంపించే ప్రయత్నాలను "తీవ్రం చేయాలని" మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు మంగళవారం చైనాకు విజ్ఞప్తి చేశారు. 

చైనాలో తన ఐదు రోజుల పర్యటనలో రెండవ రోజైన మంగళవారం, ముయిజు ఫుజియాన్ ప్రావిన్స్‌లోని మాల్దీవుల బిజినెస్ ఫోరమ్‌లో తన ప్రసంగంలో చైనాను మాల్దీవుల "దగ్గరి" మిత్రదేశంగా పేర్కొన్నాడు. "చైనా మా సన్నిహిత మిత్రదేశాలలో ఒకటి. అభివృద్ధి భాగస్వాములలో ఒకటి" అని ఆయన అన్నారు.

ప్రధాని ప్రతీది పర్సనల్ గా తీసుకుంటారు - భారత్-మాల్దీవుల వివాదంపై మల్లికార్జున్ ఖర్గే

2014లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) ప్రాజెక్టులను ఆయన ప్రశంసించారు, అవి మాల్దీవుల చరిత్రలో అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అందించాయని ఆయన ప్రసంగంలో పేర్కొన్నారు. మాల్దీవులకు తన పర్యాటకుల ప్రవాహాన్ని పెంచాలని ఆయన చైనాను కోరారు.

"చైనా మా (మాల్దీవుల) మార్కెట్ ప్రీ-కోవిడ్ నంబర్ వన్, చైనా ఈ స్థానాన్ని తిరిగి పొందేందుకు మేం ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని నా అభ్యర్థన" అని అతని అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. అలాగే, హిందూ మహాసముద్ర ద్వీపంలో ఇంటిగ్రేటెడ్ టూరిజం జోన్‌ను అభివృద్ధి చేయడానికి రెండు దేశాలు 50 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌పై సంతకం చేశాయని మాల్దీవియన్ మీడియా నివేదించింది.

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన సందర్భంగా ఒక సహజమైన బీచ్‌లో ఆయన వీడియోను పోస్ట్ చేసిన తర్వాత కొందరు మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో దౌత్యపరమైన వివాదంలో ఎక్కువ మంది చైనీస్ పర్యాటకుల కోసం ముయిజ్జూ విజ్ఞప్తి చేశారు.సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్ట్‌లు చేసినందుకు ముగ్గురు డిప్యూటీ మంత్రులను ముయిజు ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

అలాగే, మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ కూడా అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇంతకుముందు మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, 2023లో భారతదేశం అతిపెద్ద పర్యాటక మార్కెట్‌గా మిగిలిపోయింది.

మాల్దీవులకు అత్యధిక సంఖ్యలో సందర్శకులు భారతదేశం నుండి 209,198 మంది వెళ్తారు. ఆ తరువాతి స్థానంలో 209,146 మందితో రష్యా రెండవ స్థానంలో ఉంది.  చైనా 187,118 మందితో మూడవ స్థానంలో ఉంది. 2022లో, భారతదేశం 240,000 మందితో మాల్దీవుల పర్యాటక మార్కెట్‌గా అగ్రస్థానంలో ఉంది. 198,000 మంది పర్యాటకులతో రష్యా రెండవ స్థానంలో ఉంది. 177,000 మంది పర్యాటకులతో బ్రిటన్ మూడవ స్థానంలో ఉంది.

కోవిడ్‌కు ముందు, చైనా 2.80 లక్షల మంది పర్యాటకులతో అగ్రస్థానంలో ఉంది, అయితే దాదాపు నాలుగు సంవత్సరాల లాక్‌డౌన్ విధానం, దాని ఆర్థిక వ్యవస్థ నిరంతర మందగమనం కారణంగా ప్రస్తుతం దేశీయ, విదేశీ పర్యాటకాన్ని పునరుద్ధరించడానికి కష్టపడుతోంది. ఫలితంగా, కోవిడ్‌కి ముందు లక్షలాది మంది సెలవుల కోసం విదేశాలకు వెళ్లిన చైనా పర్యాటకులు ఇప్పుడు ఆర్థిక మందగమనం కారణంగా తమను తాము పరిమితం చేసుకుంటున్నారు.

తన ఫుజియాన్ పర్యటన ముగించుకుని, ముయిజు మంగళవారం బీజింగ్‌కు చేరుకున్నారు, అక్కడ అధ్యక్షుడు జి జిన్‌పింగ్, ప్రీమియర్ లీ కే కియాంగ్‌లతో చర్చలు జరపాలని భావిస్తున్నారు. ముయిజ్జుతో పాటు మాలిదీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ మాట్లాడుతూ, రాబోయే మూడు రోజుల వ్యవధిలో అధ్యక్షుడు ఉన్నత స్థాయి సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారని చెప్పారు.

"ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేయడం, చైనాతో మెరుగైన సహకారం కోసం మార్గాలను అన్వేషించడంపై మా దృష్టి ఉంది" అని ఆయన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మాల్దీవులలో చైనా అనుకూల రాజకీయవేత్తగా పరిగణించబడుతున్న ముయిజ్జూ ఫోరమ్‌తో మాట్లాడుతూ, తన పరిపాలన మాల్దీవుల ఆర్థిక స్థావరాన్ని వైవిధ్యపరచడం, పర్యాటక పరిశ్రమను బలోపేతం చేయడం, సందర్శకుల సంఖ్యను పెంచడం కొనసాగించడంతోపాటు ఆర్థిక భద్రతను నిర్ధారించడంపై దృష్టి సారించింది.

చైనాతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టిఎ) త్వరితగతిన అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇది రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత వాణిజ్య సంబంధాలకు చిహ్నంగా అభివర్ణించింది. చైనా అనుకూల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ పరిపాలనలో మాల్దీవులు, చైనా డిసెంబర్ 2014లో ఎఫ్ టీఏపై సంతకం చేశాయి. అయితే, అతని వారసుడు, అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని అమలు చేయలేదని మాల్దీవుల మీడియా నివేదికలు తెలుపుతున్నాయి.

ఎఫ్‌టిఎ రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత వాణిజ్య సంబంధాలకు ప్రతీక అని ఆయన అన్నారు. "ద్వైపాక్షిక వాణిజ్యం,పెట్టుబడులను పెంచడం ఎఫ్ టీఏ లక్ష్యం, ముఖ్యంగా చైనాకు మన చేపల ఉత్పత్తులను ఎగుమతి చేయడం ఎఫ్ టీఏ ద్వారా మాకు కీలకమైన ప్రాధాన్యత" అని ఆయన చెప్పారు.

2022లో చైనా-మాల్దీవుల ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం 451.29 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో మాల్దీవుల నుండి 60,000 డాలర్ల ఎగుమతులకు వ్యతిరేకంగా చైనా ఎగుమతులు  451.29 మిలియన్ల డాలర్లగా ఉన్నాయి. మాల్దీవ్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో 11 ప్రాజెక్ట్‌ల కోసం చైనా కంపెనీల నుంచి పెట్టుబడులను కూడా ముయిజ్జు కోరింది.

ఈ ప్రాజెక్టులలో మేల్ కమర్షియల్ పోర్ట్‌ను థిలాఫుషికి మార్చడం, వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి ప్రాజెక్ట్, మరో 15 విమానాశ్రయాల నిర్మాణం, సెజ్ విస్తరణ, మాల్దీవులు వెబ్ పోర్టల్ edition.mv ఉన్నట్టుగా నివేదించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios