కరోనా వ్యాక్సిన్ తయారీలో చైనా ముందడుగు: మనుషులపై రెండో దశ ట్రయల్స్

కరోనా వ్యాక్సిన్ తయారీలో మనుషులపై రెండో దశ కీలక పరీక్షలు చేపడుతున్నట్టుగా చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ బయాలజీ ఆదివారం నాడు ప్రకటించింది.

Chinese researchers launch second phase of human test for possible coronavirus vaccine


బీజింగ్:కరోనా వ్యాక్సిన్ తయారీలో మనుషులపై రెండో దశ కీలక పరీక్షలు చేపడుతున్నట్టుగా చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ బయాలజీ ఆదివారం నాడు ప్రకటించింది.

also read:కరోనాకు మందు కనిపెట్టిన హైద్రాబాద్ హెటిరో: కోవిఫోర్‌ పేరుతో మార్కెట్లోకి విడుదల

కరోనా వైరస్ ను నిరోధించేందుకు వైరస్ తయారీలో ప్రపంచంలో వ్యాక్సిన్లు తయారీలో ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ వైరస్ ను తొలిసారిగా గుర్తించిన చైనాలో వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు వేసింది. మనుషులపై రెండో దశ ప్రయోగాలను ప్రారంభించినట్టుగా ఆ సంస్థ తెలిపింది. 

వ్యాక్సిన్‌ సామర్థ్యం, భద్రతను పరిశీలించేందుకు రెండో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌లో కీలక పరీక్షలు చేపడతామని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు చెందిన ఐఎంబీసీఏఎంఎస్‌ ప్రకటించింది.ఈ పరీక్షలో వ్యాక్సిన్‌ ఆరోగ్యవంతుల్లో వ్యాధి నిరోధక వ్యవస్ధను ఎంతవరకూ ప్రేరేపిస్తోంది, ఎంత డోస్‌ ఇవ్వాలనే దానిపై పరిశోధకులు ఓ అంచనాకు రానున్నారు.

 చైనాలో వ్యాక్సిన్‌ సరఫరాను పూర్తిస్ధాయిలో చేపట్టేందుకు ప్రత్యేక ప్లాంట్‌లో వ్యాక్సిన్ల తయారీ చేపడతామని ఐఎంబీసీఏఎంఎస్ వెల్లడించింది. ఇక మహమ్మారి కేసులు కరోనా వైరస్‌ ప్రపంచానికి పెనుముప్పుగా మారనుందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

ఈ ఏడాది చివరినాటికి ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్‌ను అందించేందుకు కసరత్తు చేస్తున్నామని చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ డైరెక్టర్‌ గవోఫు పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios