Asianet News TeluguAsianet News Telugu

బ్రెజిల్ చికెన్ లో కరోనా ఆనవాళ్లు: చైనా

చికెన్ లో కూడ కరోనా ఆనవాళ్లు కన్పిస్తున్నాయి. ఈ విషయాన్ని చైనా ప్రకటించింది. బ్రెజిల్ నుండి దిగుమతి చేసుకొన్న చికెన్ లో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్టుగా దక్షిణ చైనా సిటీ షాంజైన్ ప్రకటించింది.

China Says Frozen Chicken Wings From Brazil Test Positive For Coronavirus
Author
Beijing, First Published Aug 13, 2020, 6:10 PM IST

బీజింగ్: చికెన్ లో కూడ కరోనా ఆనవాళ్లు కన్పిస్తున్నాయి. ఈ విషయాన్ని చైనా ప్రకటించింది. బ్రెజిల్ నుండి దిగుమతి చేసుకొన్న చికెన్ లో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్టుగా దక్షిణ చైనా సిటీ షాంజైన్ ప్రకటించింది.

సాధారణ చెకప్ లో భాగంగా మాంసపు మార్కెట్లో నిర్వహించిన కరోనా నిర్ఱారణ పరీక్షల్లో ఈ విషయం తేలిందని దక్షిణ చైనా షాంజైన్ స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. షాంజైన్ పట్టణంలోని ప్రఖ్యాత షింఫడీ సీ ఫుడ్ మార్కెట్లో కరోనా ఆనవాళ్లను గుర్తించారు. ఈ మార్కెట్లో వైద్యులు నిరంతరం పరీక్షిస్తున్నారు.

గురువారం నాడు బ్రెజిల్ నుండి దిగుమతి చేసుకొన్న కోడి రెక్కల్లో కరోనా వైరస్ ను గుర్తించినట్టుగా తెలిపారు. ఈ మార్కెట్లో మాంసం కొనుగోలు కోసం వచ్చిన వారిని పరీక్షిస్తే ప్రతి ఒక్కరికి కరోనా నెగిటివ్ వచ్చింది. 

ఈ చికెన్ దక్షిణ రాష్ట్రమైన శాంటా కాటరినాలోని అరోరా అలిమెంటోస్ ప్లాంట్ నుండి వచ్చిందని చైనా తెలిపింది.  దిగుమతి చేసుకొన్న ఆహార పదార్ధాలు, జల ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చైనా ప్రజలను కోరింది.

దిగుమతి చేసుకొన్న మూడు  సీఫుడ్ ప్యాకింగ్ నమూనాలు కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఛైనాలోని షాన్డాండ్ రాష్ట్రం తన అధికారిక విబో అకౌంట్ ద్వారా ప్రకటించింది. ఈక్వెడార్ నుండి దిగుమతి చేసుకొన్న సీఫుడ్స్ ప్యాకేజీల్లో కరోనా కూడ ఉన్నట్టుగా చైనా ప్రభుత్వం మరో ప్రకటనలో ప్రకటించింది. 
ఈ విషయాన్ని బుధవారం నాడు చైనా తన టీవీ ద్వారా బుధవారం నాడు ప్రకటించింది.ఇదిలా ఉంటే ఈ విషయమై బ్రెజిల్ మాత్రం ఇంకా స్పందించలేదు. 

గత ఏడాది నవంబర్ మాసంలో చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ ను గుర్తించారు. అప్పటి నుండి కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా కేసుల్లో అమెరికా ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్ నిలిచింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios