Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్రికాలో మరోసారి ఉగ్రదాడి.. బస్సుపై విచక్షణారహిత కాల్పులు.. 32 మంది దుర్మరణం

ఆఫ్రికా దేశం మాలి మరోసారి నెత్తరోడుంది. ఉగ్రవాదుల అరాచకాలతో 32 మంది పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బండియాగరా పట్టణంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును అడ్డుకుని ముష్కర మూకలు భీకర కాల్పులకు తెగబడ్డాయి. ముందు డ్రైవర్‌ను చంపేసి ఆ తర్వాత ప్రయాణికులప విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ దేశంలో ఇటీవలే ఓ యూఎన్ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి జరిగింది.
 

32 passengers died as terrorists attack bus in africas mali
Author
New Delhi, First Published Dec 4, 2021, 2:00 PM IST

న్యూఢిల్లీ: పశ్చిమ ఆఫ్రికా దేశం మాలి మరోసారి నెత్తురోడింది. ఓ మార్కెట్‌లో పని చేయడానికి కార్మికులు వెళ్తున్న ఓ బస్సుపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల ధాటికి బస్సులో మంటలు రేగాయి. ఈ ఘటనలో సుమారు 32 మంది దుర్మరణం చెందారు. మరణించిన వారిలో అత్యధికులు మహిళలే కావడం గమనార్హం. వారంత సమీపంలోని ఓ మార్కెట్‌లో పని చేసే వారు. మాలిలోని మోప్తి రీజయన్‌లో బండియాగరా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బంకాస్ టౌన్ మేయర్ ములాయె గిండో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కొందరు సాయుధులు బస్సును అడ్డుకున్నారని, ఆ తర్వాత ఆ వాహనంపై భీకర కాల్పులకు తెగబడ్డారని తెలిపారు. అనంతరం, బస్సు టైర్లను ధ్వంసం చేశారని, ఆ తర్వాత అందులోని ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్టు వివరించారు. 

సోంగో అనే గ్రామం నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని బండియాగరా పట్టణంలోని మార్కెట్‌కు వారంలో రెండు  సార్లు ట్రిప్‌లు వేస్తుంటుంది. ఈ ప్రయాణాలను గమనించిన ఉగ్రవాదులు పక్కా స్కెచ్‌తో దాడికి పాల్పడ్డారు. సోంగో గ్రామం నుంచి చాలా మంది ఆ మార్కెట్‌లో పని చేయడానికి ఆ బస్సులో బయల్దేరారు. కాగా, బస్సు రావడాన్ని గుర్తించి మిలిటెంట్లు దాన్ని అటకాయించారు. ముందు ఆ బస్సు డ్రైవర్‌ను కాల్చి చంపేశారు. అనంతరం బస్సు టైర్లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత అందులోని ప్రయాణికులే టార్గెట్‌గా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పులకు చాలా మంది ప్రయాణికులు బస్సులో మరణించి విగతజీవులై పడిపోయారు. అయితే, ఉగ్రవాదుల కాల్పులు భీకరంగా ఉండటంతో ఆ బస్సులో మంటలు వ్యాపించాయి. దీంతో కొనఊపిరితో ఉన్నవారూ ఆ మంటల్లో సజీవ దహనం అయిపోయారు.

Also Read: జైలులో గ్యాంగ్ వార్.. 68 మంది మృతి.. డ్రగ్స్ రవాణాపై ఆధిపత్యం కోసం ఘర్షణలు!

సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. మంటల్లో కాలిపోయిన ఆ బస్సు శవాలతో నిండిపోయినట్టుగా ఆ చిత్రాల్లో కనిపించింది. అయితే, ఆ బస్సులోని ఇంకొందరు తప్పించుకుని ఉండవచ్చని, మరికొందరు గాయాలతో బయటపడ్డవారూ ఉన్నట్టు తెలిసింది.

పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదుల దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి. ఆ దేశంలో వేగంగా పెరుగుతున్న జిహాదిస్టులకు ఇది సంకేతంగా మారుతున్నది. అల్ ఖైదా, ఐఎస్ గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు ఈ దేశంలో పేట్రేగిపోతున్నారు. ఇప్పటికే పలుసార్లు ఈ దేశంలో తిరుగుబాట్లు జరిగాయి. ఇలాంటి ఓ తిరుగుబాటుతోనే మే నెలలో అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ, అదేమంత శక్తిమంతమైనది కాదు. చాలా బలహీన ప్రభుత్వం. దీంతో ఉగ్రవాద మూకలకు ఈ పరిస్థితులు కలిసి వచ్చాయి. ఇటీవలి రోజుల్లోనే ఇలాంటి ఉగ్రఘటనే చోటుచేసుకుంది. ఐరాస అధికారులకు చెందిన ఓ కాన్వాయ్‌పై టెర్రరిస్టులు దాడి చేశారు. ఇందులో ఓ పౌరుడు హతమయ్యాడు. మరొకరు గాయాలపాలయ్యాడు. 

Also Read: Bulgaria: రోడ్డు ప్రమాదం.. బస్సులో మంటలు.. 45 మంది సజీవ దహనం

మాలి దేశంలో 16 నెలల్లో రెండు సైనిక తిరుగుబాట్లు జరిగాయి. తత్ఫలితంగా అక్కడి ప్రభుత్వం బలహీనమైంది. దీనికితోడు ఇక్కడ ఫ్రాన్స్ సంకీర్ణ సేనల ఆపరేషన్లు నిలిచిపోయాయి. దీంతో ఉగ్రమూకలు పేట్రేగిపోతున్నాయి. ఉగ్రవాదులు, జిహాదిస్టు గ్రూపులు అరాకాలకు పాల్పడుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios