తెల్లారే వరకు అదే పని... సురేఖావాణి కూతురు సుప్రీతను గట్టిగా వాడేస్తున్న డైరెక్టర్!
సుప్రీతను అప్పుడే గట్టిగా వాడేస్తున్నారు. తెల్లవారు ఝాము 3 వరకు నాన్ స్టాప్ గా పని చేయిస్తున్నారట. చిన్న పిల్ల అని కూడా చూడకుండా చుక్కలు చూపిస్తున్నారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.
Amar Deep Chowdary
కూతురిని హీరోయిన్ చేయాలన్న నటి సురేఖావాణి కల నెరవేరింది. సుప్రీత ఓ చిత్రానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి హీరోగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో సుప్రీత హీరోయిన్.
ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫస్ట్ మూవీతో హిట్ కొట్టి హీరోయిన్ గా సెటిల్ కావాలని సుప్రీత గట్టి పట్టుదలతో ఉంది. ఇందు కోసం బాగా కష్టపడుతుంది. కాగా తెల్లవారు ఝామున మూడు గంటల వరకు సుప్రీత షూటింగ్ చేస్తూనే ఉందట. ఈ మేరకు ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది.
రాత్రి 1:45 నిమిషాలకు ఒక పోస్ట్ పెట్టింది సుప్రీత. అందులో వర్క్ వర్క్ వర్క్ అని కామెంట్ జోడించింది. మరొక పోస్ట్ లో తెల్లవారు ఝామున 3 గంటలకు ప్యాక్ అప్ చెప్పారని వెల్లడించింది. ఈ క్రమంలో తెల్లార్లు అదే పనిగా సుప్రీతతో పని చేయిస్తున్నారని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ డైరెక్టర్ గట్టిగా వాడేస్తున్నాడని అంటున్నారు. సుప్రీత పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి.
సురేఖావాణి తన కూతురిని సోషల్ మీడియా వేదికగా పాపులర్ చేసింది. కూతురు సుప్రీతతో కలిసి డాన్స్ వీడియోలు, ఫోటో షూట్స్ చేస్తూ ఉండేది సురేఖావాణి. మొదట్లో తల్లి కారణంగా గుర్తింపు తెచ్చుకున్న సుప్రీత సోషల్ మీడియాలో ఓన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది.
ఆమె తరచుగా అభిమానులతో ఆన్లైన్ ఛాట్ చేస్తుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఆ మధ్య బుల్లితెర షోలలో కూడా సందడి చేసింది. కాగా సుప్రీత తండ్రి 2019లో అనారోగ్యంతో కన్నుమూశాడు. తల్లితో పాటు సుప్రీత జీవిస్తుంది.
ఇక తల్లి కోసం సుప్రీత సంబంధాలు వెతుకుతుందట. మంచి అంకుల్ దొరికితే పెళ్లి చేసేస్తా అంటుంది. అమ్మను మంచిగా చూసుకునే వ్యక్తి దొరికితే చాలని అంటుంది. మంచి హైట్, పర్సనాలిటీ, అందం ఉన్న వ్యక్తి కావాలని ఆ మధ్య సురేఖావాణి ఓపెన్ కావడం విశేషం.