Asianet News TeluguAsianet News Telugu

ఓటీటీలో దుమ్మురేపుతున్న `గామి`.. విశ్వక్‌ సేన్‌ సరికొత్త రికార్డ్..

విశ్వక్‌ సేన్‌ నటించిన `గామి` మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన రాబట్టుకుంది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతుంది. 
 

vishwak sen gaami movie create new record in ott
Author
First Published Apr 16, 2024, 1:17 PM IST

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ఇటీవల `గామి` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. తెలుగులో వచ్చిన ప్రయోగాత్మక మూవీ ఇది. చెట్టు కోసం హిమాలయాల్లో సాహసోపేతమైన జర్నీ చేయడం ప్రధానంగా ఈ మూవీ సాగింది. విధ్యాధర్‌ కాగిత దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నెలలో విడుదలైంది. థియేటర్‌లో ఈ సినిమాకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సినిమా స్లోగా సాగడం, హైలీ టెక్నీకల్‌గా ఉండటంతో సాధారణ ఆడియెన్స్ కి పెద్దగా ఎక్కలేదు. దీంతో థియేటర్లో ఈ మూవీకి మిశ్రమ దక్కింది. కానీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంది. 

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన `గామి` ఏప్రిల్‌ 12న ఓటీటీలో విడుదలైంది. జీ5లో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతుంది. తాజాగా 72 గంటల్లోనే ఇది రికార్డు వ్యూస్‌ పొందింది. ఏకంగా యాభై మిలియన్ స్ట్రీమింగ్‌ మినిట్స్ ని దాటేసింది. ఓ యంగ్‌ హీరో సినిమాకి ఈ రేంజ్‌లో స్ట్రీమింగ్‌ మినిట్స్ నమోదు కావడం రికార్డు అనే చెప్పాలి. అలా యంగ్‌ హీరోలకు సంబంధించిన విశ్వక్‌ సేన్‌ సరికొత్త రికార్డుని క్రియేట్‌ చేశాడని చెప్పొచ్చు. ఇందులో విశ్వక్‌ సేన్‌తోపాటు ఛాందినీ చౌదరీ, అభినయ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 

ఇక `గామి` కథేంటో చూస్తే, `హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. ఎవరైన వ్యక్తులు అతన్ని తాకితే ఛర్మం రంగుమారుతుంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుంటాడు. శంకర్‌కి ఉన్న ఈ వింత జబ్బుకి తోటి అఘోరాలు కూడా అతన్ని అక్కడి నుంచి పంపించేస్తారు. దీంతో తన సమస్యకి పరిష్కారం వెతుక్కుంటూ కాశీకి వెళ్తాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు.

తనతోపాటు ఆ మాలి పత్రాల కోసం డాక్టర్ జాహ్నవి కూడా అతనితోపాటు వెళ్తుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు బాగా తెరపై ఆవిష్కరించారు. విజువల్‌గా ఈ మూవీ ఓ వండర్‌లా ఉంటుంది. టెక్నీకల్‌గా, సౌండింగ్‌ పరంగా హైలైట్‌గా నిలుస్తుంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ హైలైట్‌గా నిలుస్తుంది. టెక్నికల్‌గా బ్రిలియంట్‌గా ఉన్న ఈ మూవీ కమర్షియల్‌గా మాత్రం ఆదరణపొందలేదు. కానీ ఓటీటీలో దుమ్మురేపుతుండటం విశేషం.  
 

Follow Us:
Download App:
  • android
  • ios