Asianet News TeluguAsianet News Telugu

నానిని కొట్టేసిన టిల్లు.. టార్గెట్‌ విజయ్ దేవరకొండ.. `టిల్లు స్క్వైర్‌` టోటల్‌ కలెక్షన్లు..

`టిల్లు స్కేర్‌` మూవీ కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది. ఈ మూవీ ఇప్పటికీ విజయవంతంగా రన్‌ అవుతుంది. తాజాగా రేర్‌ ఫీట్‌ని అందుకుంటుంది. 
 

tillu square collections siddu next target vijay deverakonda arj
Author
First Published Apr 16, 2024, 6:14 PM IST

సిద్దు జొన్నలగడ్డ పేరు ఇప్పుడు టిల్లుగా మారిపోయింది. సిద్దు కంటే టిల్లుగానే పిలుస్తున్నారు ఆడియెన్స్. టిల్లు అనే పాత్రలో అంతగా లీనమై చేశాడు సిద్దు. మ్యానరిజం, డైలాగ్‌లు అన్నీ దించేశాడు. టిల్లుగానే పాపులర్‌ అయ్యాడు. అందుకే ఎక్కడ చూసినా టిల్లుగా పిలుస్తున్నారు. అలా పాత్ర పేరుతో పాపులర్‌ కావడం నటుడికి అదృష్టం. అంతటి అద్భుతమైన నటనకు నిదర్శనం. ఆ విషయంలో సిద్దు నిరూపించుకున్నాడు. ఇప్పుడు టిల్లుగా టాలీవుడ్‌ని ఊపేస్తున్నాడు. 

చిన్నగా ప్రారంభమైన ఈ మూవీ ఇప్పుడు సునామీ సృష్టిస్తుంది. భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా రాణిస్తుంది. గత నెలలో విడుదలైన ఈ మూవీ మధ్యలో ఎన్ని మూవీస్‌ వచ్చినా వాటిని దాటుకుని నిలబడింది. సింగిల్‌గా ఆడుతుంది. `టిల్లు స్వ్కేర్‌` ఇప్పటికే వంద కోట్లు దాటేసింది. యంగ్‌ హీరోల(టైర్‌ 2) కేటగిరిలోని హీరోలను దాటేసుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే అందరు యంగ్‌ స్టర్స్ బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ని దాటేసింది `టిల్లు స్వ్కేర్‌`.

 `బేబీ`, `ధమాఖా`, `హాయ్‌ నాన్న` వంటి సినిమాలను దాటేసింది. ఇప్పుడు నాని కెరీర్‌ హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన `దసరా`ని కూడా దాటేసింది. `దసరా` లైఫ్‌ టైమ్‌ కలెక్షన్లు 115కోట్ల(గ్రాస్‌). లేటెస్ట్ గా `టిల్లు స్వ్కేర్‌` కలెక్షన్లు 125కోట్లు(గ్రాస్‌). ఇంకా థియేటర్లలో రన్‌ అవుతుంది. ఇక మిగిలి ఉన్నది విజయ్‌ దేవరకొండ `గీతగోవిందం` కలెక్షన్లు మాత్రమే. ఈ మూవీ 130కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. దానికి మరో ఐదు కోట్ల దూరంలోనే ఉన్నాడు టిల్లుగాడు. ఇది దాటేస్తే, యంగ్‌ హీరోలో సిద్దు జొన్నలగడ్డ నెంబర్‌ వన్‌ హీరో అవుతాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

`టిల్లు స్వ్కేర్‌`లో ప్రధానంగా టిల్లు పాత్ర మ్యానరిజం, డైలాగ్‌ డెలివరీనే హైలైట్‌గా నిలిచింది. ఆ పాత్ర మాట్లాడితే నవ్వులు విరిసేలా డిజైన్‌ చేశారు సిద్దు, మల్లిక్‌రామ్‌. దీనికితోడు అనుపమా పరమేశ్వరన్‌ అందాలు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అలాగే రాధిక పాత్రని మళ్లీ తీసుకురావడంతో సెకండాఫ్‌ ఎండింగ్‌ బాగా జంప్‌ అయ్యింది. దీంతో సినిమాకి తిరుగులేదని చెప్పొచ్చు. ఎక్కడా గ్రాఫ్‌ తగ్గకుండా చూసుకున్నారు మేకర్స్. అదే సినిమాని నిలబెట్టింది. తిరుగులేని విజయాన్ని అందించాయి. సితార ఎంటర్‌టైన్స్ మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. దీనికి మూడో సీక్వెల్‌ కూడా ఉందని ఇటీవల టీమ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios