Asianet News TeluguAsianet News Telugu

పుష్ప రికార్డు లేపేసిన టిల్లు గాడు... ఇది మామూలు అరాచకం కాదు!

ఇది అసలు ఎవరూ ఊహించని పరిణామం. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప రికార్డును సిద్దు జొన్నలగడ్డ అధిగమించాడు.  
 

siddhu jonnalagadda latest movie tillu square breaks allu arjun pushpa record ksr
Author
First Published Apr 15, 2024, 6:21 PM IST

ఓడలు బండ్లు... బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో. మొన్నటి వరకు సపోర్టింగ్, విలన్ రోల్స్ చేసిన సిద్దు జొన్నలగడ్డ కెరీర్ ని డీజే టిల్లు మార్చేసింది. దానికి కొనసాగింపుగా వచ్చిన టిల్లు స్క్వేర్ మరిన్ని సంచలనాలు నమోదు చేస్తుంది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ రికార్డును టిల్లు స్క్వేర్ లేపేసింది. 2022లో విడుదలైన టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై యువతను ఊపేసింది. టిల్లు గా సిద్దు జొన్నలగడ్డ నటన పిచ్చెక్కించింది. సరికొత్త క్యారెక్టరైజేషన్ యూత్ కి కిక్ ఇచ్చింది. 

 రాధికగా నేహా శెట్టి గ్లామర్ సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన డీజే టిల్లు భారీ వసూళ్లు రాబట్టింది. దానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ అంతకు మించి రికార్డులు నమోదు చేస్తుంది. టిల్లు స్క్వేర్ వంద కోట్ల వసూళ్లు దాటేసింది. మరో విశేషం ఏమిటంటే టిల్లు స్క్వేర్ ఏకంగా అల్లు అర్జున్ రికార్డు బద్దలు కొట్టింది. 

అల్లు అర్జున్ ని పాన్ ఇండియా హీరోగా మార్చిన పుష్ప యూఎస్ లో $2.5 మిలియన్ వసూళ్లు రాబట్టింది. ఈ రికార్డుని టిల్లు స్క్వేర్ బీట్ చేసింది. టిల్లు స్క్వేర్ యూఎస్ వసూళ్లు $2.8 మిలియాన్స్ కి చేరాయి. ఒక టాప్ హీరో రికార్డును టిల్లు స్క్వేర్ అధిగమించడం ఊహించని పరిణామం. అందులోనూ మొన్నటి వరకు సిద్ధూ టైరు టు హీరోల జాబితాలో కూడా లేడు. ఆయన విలన్, సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. ఆయన ఇమేజ్ ని టిల్లు సిరీస్ మార్చేసింది. 

టిల్లు స్క్వేర్ చిత్రానికి మాలిక్ రామ్ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. సిద్దు జొన్నలగడ్డకు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. హోమ్లీ హీరోయిన్ గా పేరున్న అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ మూవీలో బోల్డ్ రోల్ చేయడం విశేషం. 

 

Follow Us:
Download App:
  • android
  • ios