Asianet News TeluguAsianet News Telugu

70 కోట్ల భారం మోస్తున్న నితిన్..ఆ ఇద్దరూ ఏంచేస్తారో, తేడా జరిగితే..

యంగ్ హీరో నితిన్ కెరీర్ ప్రస్తుతం చాలా కీలక దశలో ఉంది. నితిన్ చివరగా నటించిన ఎక్స్ట్రా, మాచర్ల నియోజకవర్గం లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

shocking budget for these nithiin movies dtr
Author
First Published Apr 29, 2024, 5:07 PM IST

యంగ్ హీరో నితిన్ కెరీర్ ప్రస్తుతం చాలా కీలక దశలో ఉంది. నితిన్ చివరగా నటించిన ఎక్స్ట్రా, మాచర్ల నియోజకవర్గం లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. నితిన్ తన మార్కెట్ ని కొల్పోకూడదు అంటే తదుపరి చిత్రాలతో హిట్ కొట్టాల్సిందే.

ప్రస్తుతం నితిన్ రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. తనకి భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ రాబిన్ హుడ్ అనే మూవీలో నటిస్తున్నాడు. అదేవిధంగా వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే చిత్రం చేస్తున్నాడు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే బడ్జెట్ విషయమే నితిన్ మార్కెట్ కి మించిపోతోంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాల బడ్జెట్ కలిపి 70 కోట్లు దాటిపోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంత బడ్జెట్ తిరిగి రాబట్టలంటే రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ కావాలి.

shocking budget for these nithiin movies dtr

ఆ విషయంలో భారం మొత్తం దర్శకులదే. రాబిన్ హుడ్ చిత్రం రాబరీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక తమ్ముడు మూవీ ..తన సోదరి కోసం ఎంతకైనా తెగించే తమ్ముడి కథగా రూపొందుతోంది.

ఇటీవలే తమ్ముడు చిత్రం కోసం 8 కోట్ల ఖర్చుతో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారు. ఈ మూవీలో కాంతర హీరోయిన్ సప్తమి నటిస్తోంది. ఇక వెంకీ కుడుముల చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios