90 రూపాయలతో అయిపోయేది, 250కోట్లు ఖర్చు చేయించిన రాజమౌళి.. ఇది మరీ దారుణం?
రాజమౌళి `బాహుబలి` సినిమా కోసం వందల కోట్లు ఖర్చు చేశాడు. కొన్నేళ్ల టైమ్ తీసుకున్నాడు. కానీ రియల్ లైఫ్‌లో అది 90తో అయిపోయింది. ఇదే వైరల్ అవుతుంది.
రాజమౌళి అంటే సినిమాని అద్భుతంగా చెక్కడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయన్ని జక్కన్న అంటారు. పర్ఫెక్షన్ కోసం ఏమైనా చేస్తారు. అందుకే ఆయన సినిమాలకు అద్భుతంగా ఉంటాయి. భారత్ మెచ్చిన దర్శకుడిగా రాణిస్తున్నారు. ఇప్పుడు గ్లోబల్ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మహేష్ బాబు సినిమాతో ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచబోతున్నారు.
Survey:వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
ఇదిలా ఉంటే ఆయనపై నెటిజన్లు రెచ్చిపోతున్నారు. సిల్లీగా ఆడుకుంటున్నారు. సెటైర్లతో రెచ్చిపోతున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావంటూ ప్రశ్నిస్తున్నారు. చిన్న సీన్ కోసం వందల కోట్లు ఖర్చు చేశాడని, ఈ చిన్న లాజిక్ తెలిస్తే వంద రూపాయలతో అయిపోయేదని పెదవి విరుస్తున్నారు. మరి ఇంతకి జక్కన్న ఏం చేశాడు, నెటిజన్ల కామెంట్లకి కారణమేంటి? వందల కోట్లు, వంద రూపాయల కథేంటి? అనేది చూస్తే,
రాజమౌళి `బాహుబలి` సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇది సంచలన విజయం సాధించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ కోసం రాజమౌళి నిర్మాతల చేత ఏకంగా నాలుగు వందల కోట్లు ఖర్చు చేయించాడు. మొదటి భాగానికి 150కోట్లు, రెండో భాగానికి 250కోట్లు అయి ఉంటుంది. కానీ ఈ మూవీ మొదటి భాగం ఐదు వందల కోట్లకుపైగా వసూలు చేస్తే, రెండో భాగం 1800కోట్లు వసూలు చేసింది ఇండియన్ సినిమా లెక్కలను మార్చేసింది. తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసింది.
అయితే ఇందులో భళ్లాలదేవ పాత్రలో నటించిన రానా.. ఓ సీన్లో భారీ బుల్‌తో ఫైట్ చేస్తాడు. దీనికోసం రానా చాలా శ్రమిస్తాడు. అంతేకాదు దీన్ని మామూలుగా చేసి గ్రాఫిక్స్ చేశారు. అలా గ్రాఫిక్స్ కే వందల కోట్లు ఖర్చు అయ్యాయి. అయితే ఇలాంటి సన్నివేశం రియల్ లైఫ్‌లో చోటు చేసుకుంది. అది ఇప్పుడు వైరల్ ఓ మద్యం ప్రియుడు(తాగుబోతు) ఫుల్లుగా మద్యం తీసుకుని రోడ్డుపై ఎద్దుతో ఫైట్ చేస్తున్నాడు. సింపుల్‌గా దానితో పోరాడి ఎట్టకేలకు దాన్ని కింద పడేశాడు. ఇందులో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.
దీనిపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్ తో ఆడుకుంటున్నారు. కేవలం 90తో అయిపోయేది, అనవసరం రాజమౌళి 250కోట్లు ఖర్చు చేశాడంటూ రచ్చ చేస్తున్నారు. అతను 90 వేసి బుల్ ని పడేశాడు, రాజమౌళికి ఆ చిన్న లాజిక్ తెలియక కోట్లు ఖర్చు చేయించాడని, అంతా బుడిదలో పోసిన పన్నీరులా చేశాడని కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. అందరిని ఆకట్టుకుంటుంది.