Asianet News TeluguAsianet News Telugu

IPL మధ్యలో ప్రత్యక్షమైన ప్రభాస్‌ - 'కల్కి', నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా!

ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో యూత్‌ అంతా టీవీలకే అతుక్కుపోతున్నారు. 

Prabhas appears as Bhairva during IPL match telecast jsp
Author
First Published May 1, 2024, 7:46 AM IST


డైరెక్టర్ నాగ్ అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాపై ఏ  రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపిక పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్స్ అందరూ నటిస్తున్న ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.  6000 ఏళ్ల నాటి కథ కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టించినట్లు గతంలో నాగ్ చెప్పిన మాటలు ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అడియన్స్. ఇక ఇటీవల విడుదలైన అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇందులో అశ్వత్థామా పాత్రలో అమితాబ్ కనిపించనున్నారని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇక తాజాగా ప్రభాస్ లుక్ రివీల్ చేస్తూ మరో అప్డేట్ ఇచ్చారు.

ఇక ఈ సినిమా ప్రభాస్‌ భైరవ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భైరవ లుక్‌ను పరిచయం చేస్తూ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు.ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో యూత్‌ అంతా టీవీలకే అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్‌లోకి భైరవను తీసుకొచ్చారు. హిందీ లో ఉన్న ఈ వీడియో బాగా ఆకట్టుకుంటుంది. ముంబై లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్‌లోకి సడెన్‌గా ప్రభాస్ భైరవ లుక్‌లో ఎంట్రీ ఇచ్చాడు. చూడటానికి ఇది ఐపీఎల్‌ యాడ్‌లా ఉన్న ఇందులో ప్రభాస్‌ను 'కల్కి' భైరవగా కొన్ని క్షణాల పాటు చూసి ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు. 

మే 3న ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుందని మ్యాచ్ మధ్యలో కల్కి నుంచి భైరవగా వచ్చి చెప్పాడు ప్రభాస్. “ఇది కూడా ఓ యుద్ధం లాంటిదే” అంటూ ప్రభాస్ చెప్పాడు. ఇలా భైరవగా ప్రభాస్ సడెన్ ఎంట్రీ చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక త్వరలోనే కల్కి చిత్రంలోని పాత్రలన్నింటిని అడియన్స్ కు పరిచయం చేయనున్నారని తెలుస్తోంది. ఈసినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios