Asianet News TeluguAsianet News Telugu

భారీ ధరకు తండేల్ డిజిటల్ రైట్స్... ఏం క్రేజ్ అబ్బా ఇది!

నాగ చైతన్య లేటెస్ట్ మూవీ తండేల్. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ఆయన కెరీర్ హైయెస్ట్ ధరకు అమ్ముడైనట్లు సమాచారం అందుతుంది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం... 
 

naga chaitanya records career highest with thandel digital rights ksr
Author
First Published Apr 29, 2024, 10:59 PM IST

నాగ చైతన్య ప్లాప్స్ లో ఉన్నాడు. ఆయన గత చిత్రాలు థాంక్యూ, కస్టడీ నిరాశపరిచాయి. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. తన మిత్రుడు చందూ మొండేటి తో చేతులు కలిపాడు. తండేల్ టైటిల్ తో ప్రాజెక్ట్ ఫిక్స్ చేశారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. ఇప్పటికే కొంత మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. 

ఈ చిత్రంలో నాగ చైతన్య జాలరి రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం. వ్ వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి రూపొందిస్తున్నారు. ఎమోషనల్ లవ్ డ్రామా అని సమాచారం. నాగ చైతన్య లుక్ చాలా రఫ్ అండ్ రస్టిక్ గా ఉంది. ఇక సాయి పల్లవితో ఆయనకు రెండో చిత్రం. వీరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం హిట్ సొంతం చేసుకుంది. 

కాగా తండేల్ డిజిటల్ రైట్స్ అమ్ముడైనట్లు టాలీవుడ్ టాక్. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తండేల్ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఏకంగా రూ. 40 కోట్లకు డీల్ సెట్ అయ్యిందట. ఇది నాగ చైతన్య కెరీర్లో హైయెస్ట్ అంటున్నారు. నాగ చైతన్య గత చిత్రాలు ప్లాప్ అయినప్పటికీ ఈ స్థాయిలో రేటు పెట్టడానికి కారణాలు ఉన్నాయి. 

కాంబినేషన్ పై నెట్ఫ్లిక్స్ ప్రతినిధులు నమ్మకంతో ఉండి ఉండొచ్చు. చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 భారీ విజయం అందుకుంది. హిందీలో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. చందూ మొండేటి నుండి వస్తున్న తదుపతి చిత్రం కావడం తండేల్ చిత్రానికి ఇంత డిమాండ్ ఏర్పడి ఉండవచ్చు. ఇంత వరకు కనీసం టీజర్ కూడా రాలేదు. రికార్డు స్థాయిలో ధర పలికింది. 

Follow Us:
Download App:
  • android
  • ios