Asianet News TeluguAsianet News Telugu

గోపీచంద్ ‘విశ్వం’ బడ్జెట్ అంతా? , హింది డబ్బింగ్ రైట్స్ ఎంతకు అమ్మారు?

 ఓవ‌ర్ బ‌డ్జెట్ అవ్వ‌డం, గోపీచంద్ సినిమాల మార్కెట్ డ్రాప్ అవ్వ‌డం, ఓటీటీ, శాటిలైట్ రైట్స్  తగ్గిపోవ‌డం వ‌ల్ల ‘విశ్వం’ ఇబ్బందుల్లో ప‌డిన‌ట్టు ..

Gopichand film  Viswam sold for Rs 12 cr in Hindi?  jsp
Author
First Published Apr 16, 2024, 10:50 AM IST

  గత కొంతకాలంగా గోపీచంద్ కెరీర్ పరిస్దితి పెద్ద గొప్పగా లేదు. వచ్చిన సినిమా వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోతోంది.   వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న  గోపీ చంద్ కొద్దిగా హిట్ తో ఊపిరి పీల్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఆశలతో తీసిన రామ బాణం కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత భీమా అని చేస్తే అది అంతంత మాత్రమే అని మొదటి వారంలోనే తేలిపోయింది. దాంతో ఇప్పుడు శ్రీను వైట్ల డైరక్షన్ లో విశ్వం అనే చిత్రం చేస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామాతో గోపీ చంద్ హిట్టు కొట్టాలని కోరుకుంటున్నారు. 

అయితే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  `విశ్వం` కూడా  ఫైనాన్సియల్ సమస్యల్లో  ఉంది. ఈ సినిమా ఇప్ప‌టికే ఓవర్ బడ్జెట్ అవ్వటంతో ...పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ  టేకొవ‌ర్ చేసింది. దర్శకుడు,  హీరో ఇద్దరు కూడా వరుస ఫ్లాఫ్స్ లో  ఉండటంతో లో బడ్జెట్ లో తెరకెక్కుతుంది అనుకున్నారు. కానీ టీసర్ రిలీజ్ తర్వాత సినిమా బడ్జెట్ గురించి  ఓ వార్త బయిటకు వచ్చింది.  ఆల్ మోస్ట్ 32-35 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ఈ సినిమా రూపొందుతుంది అని అంటున్నారు. అది ఓ రకంగా ఓవర్ బడ్జెట్టే. 

అయితే.. ఇప్ప‌టికే ఓవ‌ర్ బ‌డ్జెట్ అవ్వ‌డం, గోపీచంద్ సినిమాల మార్కెట్ డ్రాప్ అవ్వ‌డం, ఓటీటీ, శాటిలైట్ రైట్స్  తగ్గిపోవ‌డం వ‌ల్ల ‘విశ్వం’ ఇబ్బందుల్లో ప‌డిన‌ట్టు వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ రైట్స్ మంచి మొత్తానికే వెళ్లాయనే వార్త అభిమానులకు కాస్త ఆనందం కలిగిస్తోంది. 12 కోట్ల రూపాయలకు ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ వెళ్లినట్లు సమాచారం. ఇది మంచి మొత్తం. యాక్షన్ సినిమా కావటం, గోపిచంద్ యాక్షన్ సినిమాలకు హిందీ డబ్బింగ్ మార్కెట్ లో విలవ ఉండటంతో ఈ రేటు పలికిందని చెప్తున్నారు.
 
ఈ  యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.    గోపిచంద్ హై వోల్టేజ్ అవతార్‌లో కనిపిస్తున్నాడు.    ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ సినిమాలు గోపి కెరీర్ లొనే బెస్ట్ మూవీస్ గా నిలిచాయి.   .శ్రీను వైట్ల డైరెక్షన్లో.. గోపీచంద్ హీరోగా చేస్తున్న లెటెప్ట్ సినిమానే విశ్వం. చిత్రాలయం స్టూడియోస్‌ పై వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది.
 

Follow Us:
Download App:
  • android
  • ios