Asianet News TeluguAsianet News Telugu

మహేష్ బాబు ఇంట పెళ్లి సందడి, సూపర్ స్టార్ తో సెల్ఫీ దిగిన మంత్రి రోజ, వైరల్ అవుతున్న ఫోటో..

తాజాగా ఓ అరుదైన సంఘటన జరిగింది. సినిమాలో బిజీగా ఉండే మహేష్ బాబు.. రాజకీయాలతో  తీరికలేకుండా గడుపుతున్న రోజా ఇద్దరు ఓ వేదిక మీదకు వచ్చారు.. మహేష్ తో ఓ స్పెషల్ సెల్ఫీ కూడా దిగింది రోజా. 
 

AP Minister Roja Selfie Pic with Superstar Mahesh Babu JMS
Author
First Published Sep 2, 2023, 1:36 PM IST

ఓ వివాహవేదికపై అరుదైన ఘట్టం ఆవిష్క్రుతం అయ్యింది. సీనియర్ నటి, ఏపీ మినిస్టర్ రోజా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫోటో దిగడంతో పాటు.. స్పెషల్ గా సెల్ఫీ కూడా దిగింది. ఇంతకీ .. ఈ సందర్భం ఎలా వచ్చిందంటే..ఘట్టమనేని కుటుంబంలో.. రీసెంట్ గా పెళ్లి సందడి నెలకొంది. మహేష్ బాబు దగ్గరి బంధువు అయిన ఘట్టమనేని వరప్రసాద్ తనయురాలు  డాక్టర్ దామిని వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.  డాక్టర్ దామినీ వివాహం.. డాక్టర్ సేతు సందీప్ తో  ఘనంగా జరిగింది. నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్ లో  జరిగిన ఈ వేడుకలకు.. సినీరాజకీయ రంగాల నుంచి ప్రముఖులు హాజరయ్యి.. నూతన దంపతులనుఆశీర్వదించారు. 

అయితే చాలా దగ్గర  బంధువుల పెళ్ళి కావడంతో.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ వేడుకల్లో సందడి చేశారు. ఈసందర్భంగా ఈ వివాహానికి ప్రముఖ సినీనటి.. ఏపీ మినిస్టర్ రోజా...  వివాహ వేడుకకు హాజరయ్యారు.  దీంతో రోజా మహేష్ లు కాసేపు ముచ్చటించారు. రోజా మహేష్ బాబుతో సెల్ఫీ తీసుకుంది. అలాగే మహేష్ బాబుతో ఫోటో దిగింది. నూతన జంటతో పాటు మహేష్ తో దిగిన సెల్ఫీ కూడా రోజా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ సెల్ఫీ ఫోటో వైరల్ గా మారింది.

ప్రస్తుతం సూపర్ స్టార్  మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు మిర్చి సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ అనేకసార్లు బ్రేక్స్ పడుతూ.. కొనసాగుతోంది. ఈసినిమా తరువాత మహేష్ బాబు.. దిగ్గజ దర్శకుడు రాజమౌళితో సినిమాచేయబోతున్నాడు. భారీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతుంది ఈసినిమా. ఈమూవీ ప్రీప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈనినిమా కోసం మహేష్ గుర్తు పనట్టనంతగా మేకోవర్ అవ్వబోతున్నాడట. ఇప్పటికే చాలా మారిపోయాడు మహేష్ బాబు. 


 


 

Follow Us:
Download App:
  • android
  • ios