Asianet News TeluguAsianet News Telugu

అఫీషియల్ : 'మంజుమ్మల్ బాయ్స్' (తెలుగు) OTT రిలీజ్ డేట్ !

 మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రిలీజ్ తోపాటు ఈ సినిమా డిజిటల్

All time Blockbuster Film  Manjummel Boys Gets OTT Release Date  jsp
Author
First Published Apr 20, 2024, 8:07 AM IST

All time Blockbuster Film  Manjummel Boys Gets OTT Release Date  jsp

మంజుమ్మెల్ బాయ్స్   మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి దుమ్ము దులిపిన చిత్రం. ఏకంగా రూ. 230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఘనత సాధించిన మొదటి మలయాళ మూవీగా రికార్డుల కెక్కింది. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే  మంజుమ్మెల్ బాయ్స్ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అయితే థియేటర్ కు వెళ్లి చూడని వాళ్లు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.  ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చే సమయం దగ్గరపడింది. 

ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోన్న మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ ఈ బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 3 నుంచి మంజుమ్మెల్ బాయ్స్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానుంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది. ఈ మేరకు చిత్ర టీమ్  సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా ప్రకటించింది.

చిదంబర్ పీ పొదువల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలో శోభున్ షాహిర్ తో పాటు, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్, అభిరాం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. యదార్థ సంఘటన ఆధారంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ తెరకెక్కింది.

2006లో కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ గుహలకు వెళ్తారు. వాళ్లలో ఓ యువకుడు ప్రమాదవశాత్తూ ఓ లోతైన గుహలోకి పడిపోతాడు. అతన్ని రక్షించడానికి మిగిలిన స్నేహితులు అందరూ కలిసి ఎలాంటి సాహసం చేశారన్నదే ఈ సినిమా కథ. మలయాళంతోపాటు తమిళంలోనూ మంచి వసూళ్లు సాధించింది. అక్కడ స్టార్ హీరో సూర్య అత్యధిక వసూళ్లను కూడా ఈ సినిమా దాటేసిందంటే ఏ స్థాయిలో అక్కడి ప్రేక్షకులు ఆదరించారో అర్థం చేసుకోవచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios