Asianet News TeluguAsianet News Telugu

న‌న్నే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొల‌గిస్తారా.. బ్యాట్‌తో క్వింటన్ డికాక్ విధ్వంసం

RCB vs LSG: ఐపీఎల్ 2024లో 14వ మ్యాచ్ లో బెంగ‌ళూరు-ల‌క్నో జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ సీజ‌న్ లో ఆర్సీబీ ఇప్పటికే రెండు పరాజయాలను చవిచూసింది. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ విధ్వంసంతో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.

 

RCB vs LSG: Quinton de Kock, who created havoc with the bat after being sacked from the central contract RMA
Author
First Published Apr 2, 2024, 10:11 PM IST

RCB vs LSG - IPL 2024 : క్వింటన్ డి కాక్.. క్రికెట్ ప్ర‌పంచంలో పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్ గా,  ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా అనేక వేదికలపై జట్టును విజయతీరాలకు చేర్చాడు. అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌తో అద‌ర‌గొట్టాడు. అయితే, ఊహించ‌ని విధంగా ఇటీవల అత‌న్నిసెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తొలగించబడ్డాడు. ఈ నిర్ణ‌యం తీసుకున్న సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు త‌న బ్యాట్ తోనే స‌మాధానం చెప్పాల‌నుకున్నాడో ఏమో కానీ.. ఇప్పుడు ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌పై ఫోర్లు, సిక్స‌ర్లతో విరుచుకుప‌డ్డాడు.

ఎం చిన్న‌స్వామి స్టేడియం వేదికగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు-ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ్యాచ్ లో క్వింట‌న్ డి కాక్ తన అద్భుత బ్యాటింగ్‌తో సీఎస్ఏ బోర్డుకు త‌న‌ బ్యాటింగ్ తో స‌మాధాన‌మిచ్చాడు. సొంతగడ్డపై గెలుస్తామన్న ధీమాతో ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియంలోకి అడుగుపెట్టింది. అయితే, చిన్నస్వామి స్టేడియంలో డికాక్ బ్యాట్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో ఆర్‌సీబీ ముందు భారీ టార్గెట్ ను ఉంచాడు. 81 ప‌రుగులు త‌న ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో బెంగ‌ళూరు బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

ఐపీఎల్ 2024లో డి కాక్ హాఫ్ సెంచరీ చేయడం ఇదే మొదటిసారి కాదు. అంత‌కుముందు మ్యాచ్ లో కూడా డికాక్ బ్యాట్ తో అద‌ర‌గొట్టాడు. పంజాబ్ కింగ్స్‌పై 54 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును 21 పరుగుల తేడాతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆర్సీబీపై కూడా డి కాక్ బ్యాట్ తో బౌల‌ర్ల దుమ్ముదులిపాడు. ఈ మ్యాచ్‌లో క్వింటన్ డి కాక్‌కు కూడా లైఫ్ లభించింది. గ్లెన్ మాక్స్‌వెల్ తన క్యాచ్‌ను వ‌దిలేయ‌డంతో ఆర్సీబీ భారీ ముల్యం చెల్లించుకుంది. 56 బంతుల్లో 5 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 82 పరుగులతో బిగ్ ఇన్నింగ్స్ ను ఆడాడు. దీంతో ల‌క్నో టీమ్ 16 ఓవర్లలో 140 పరుగుల మార్కును దాటింది. మ‌రో ఎండ్ లో నికోల‌స్ పూరాన్ మెరుపులు మెరిపించాడు. 21 బంతుల్లో 40  ప‌రుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. దీంతో ల‌క్నో 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 181 ప‌రుగులు చేసింది.

 

HAT-TRICK WICKETS: బౌలింగ్ సంచ‌ల‌నం.. టీ20 క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన 21 ఏళ్ల యంగ్ ప్లేయ‌ర్ 

Follow Us:
Download App:
  • android
  • ios