Asianet News TeluguAsianet News Telugu

PBKS vs RR Highlights : తీరుమార‌ని పంజాబ్.. కింగ్స్ ను దెబ్బ‌కొట్టిన రాయ‌ల్స్..

IPL 2024: యంగ్ స్టార్ ప్లేయ‌ర్ యశ‌స్వి జైస్వాల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు సాగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో పంజాబ్‌పై రాజస్థాన్ రాయ‌ల్స్ ఘ‌న విజ‌యం సాధించింది. 
 

PBKS vs RR Highlights : Punjab has not changed.. Rajasthan Royals' thrilling win over Punjab Kings IPL 2024 RMA
Author
First Published Apr 13, 2024, 11:59 PM IST

PBKS vs RR Highlights : ఐపీఎలో లో పంజాబ్ ఆట‌తీరును మార్చుకోవ‌డం లేదు. ఆరంభంలో అద‌ర‌గొట్టి కీల‌క‌మైన చివ‌రలో తుస్సుమంటున్న పంజాబ్ ప్లేయ‌ర్లు మ‌రోసారి అదే త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో ఆ టీమ్ కు మ‌రో ఓట‌మి త‌ప్ప‌లేదు. అయితే, చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు థ్రిల్లింగ్ ను పంచిన ఈ మ్యాచ్ లో హిట్మేయ‌ర్ హిట్టింగ్ తో రాజస్థాన్ రాయ‌ల్స్ మ‌రో విజ‌యాన్ని అందుకుంది. ఐపీఎల్ 2024 పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ లో నిలిచింది. 

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024లో 27వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కు దిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఏ బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. అశుతోష్ శ‌ర్మ 31, జితేష్ శ‌ర్మ 29, లివింగ్‌స్టోన్ 21 ప‌రుగుల‌తో రాణించారు. బౌల‌ర్ల‌లో అవేష్ ఖాన్ 2, కేశ‌వ్ మ‌హారాజ్ 2 వికెట్లు తీసుకున్నారు.

ఐపీఎల్‌లో నిషేధానికి గురయ్యే ప్రమాదంలో రిష‌బ్ పంత్.. !

రాజస్థాన్ రాయల్స్ మరో 1 బంతి మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు కూడా ఈ మ్యాచ్ క్రికెట్ ల‌వ‌ర్స్ కు మంచి థ్రిల్ ను పంచింది. యశ‌స్వి  జైస్వాల్ బాగా బ్యాటింగ్ చేశాడు. కానీ రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ ఎవరూ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో తొలిసారి ఏ మ్యాచ్‌లోనూ హాఫ్‌ సెంచరీ న‌మోదుకాక‌పోవ‌డం ఇదే తొలిసారి. జైస్వాల్ 39  ప‌రుగులు, తనుష్ కోటియన్ 24, రియాన్ ప‌రాగ్ 23, షిమ్రాన్ హెట్మెయర్ 27 ప‌రుగులు సాధించాడు. షిమ్రాన్ హెట్మెయర్ చివ‌ర‌లో మెరుపులు మెరిపించాడు. బౌండరీ కొట్టి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు విజ‌యం అందించాడు. బౌల‌ర్ల‌లో కగిసో రబడ 2, సామ్ కర్రాన్ 2 వికెట్లు తీసుకున్నారు.

 

 

6 బంతుల్లో 6 సిక్సర్లు... 9 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీతో విధ్వంసం.. వీడియో వైరల్ 

Follow Us:
Download App:
  • android
  • ios