Asianet News TeluguAsianet News Telugu

అయ్యో.. మోహిత్ శ‌ర్మ ఎంత‌ప‌ని చేశావ్.. ట్రోలర్స్ ఆటాడుకుంటున్నారుగా.. !

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో డెత్ ఓవర్లలో అద‌ర‌గొట్టే మోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును న‌మోదుచేస్తూ భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. 
 

Mohit Sharma's worst record in IPL..Trollers are relentlessly attacking , Tata IPL 2024 RMA
Author
First Published Apr 25, 2024, 5:30 PM IST

IPL 2024 - Mohit Sharma:  బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ 40వ‌ మ్యాచ్‌లో, గుజరాత్ టైటాన్స్‌కు ఒక ఆటగాడు అతిపెద్ద విలన్‌గా మారాడు. డెత్ ఓవర్లలో సూప‌ర్ బౌలింగ్ తో అద‌ర‌గొట్టే మోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన రికార్డు సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోహిత్ శర్మ 4 ఓవర్లలో వికెట్ పడకుండా 73 పరుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒక బౌలర్ ఒక మ్యాచ్ లో స‌మ‌ర్పించుకున్న అత్య‌ధిక ప‌రుగులు ఇవే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో మోహిత్ శ‌ర్మ పేరిట చెత్త రికార్డు న‌మోదైంది. శర్మకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌలింగ్ స్పెల్ ఇదే. 

మోహిత్ శర్మ కంటే ముందు ఈ చెత్త రికార్డు బాసిల్ థంపి పేరిట ఉంది. బాసిల్ థంపి 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్‌లో 70 పరుగులు ఇచ్చాడు. 

ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు వీరే.. 

73 - మోహిత్ శర్మ వర్సెస్ డీసీ*
70 - బాసిల్ థంపి వర్సెస్ ఆర్సీబీ
69 - యశ్ దయాల్ వర్సెస్ కేకేఆర్
68 - రీస్ టాప్లీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ 
66 - క్వేనా మఫాకా వర్సెస్ ఎస్ఆర్హెచ్
66 - అర్ష్దీప్ సింగ్ వర్సెస్ ఎంఐ
66 - ముజీబ్ జద్రాన్ వర్సెస్ ఎస్ఆర్హెచ్
66 - ఇషాంత్ శర్మ వర్సెస్ సీఎస్కే

మోహిత్ శ‌ర్మ‌పై ఘోరంగా ట్రోల్స్.. 

ఢిల్లీ క్యాపిటల్స్‌పై మోహిత్ శర్మ తన చివరి ఓవర్‌లో 31 పరుగులు ఇచ్చాడు. మోహిత్ శర్మ వేసిన ఈ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ రిషబ్ పంత్ 1 ఫోర్, 4 సిక్సర్లు బాదాడు. మోహిత్ శర్మ ఈ ఓవర్‌లో 2, డబ్ల్యూడి, 6, 4, 6, 6, 6 ద్వారా 31 పరుగులు ఇచ్చాడు. మోహిత్ శర్మ డెత్ ఓవర్లలో చాలా పొదుపుగా బౌలింగ్ చేయ‌డంలో దిట్ట‌, కానీ ఈ సారి భారీగా ప‌రుగులు ఇచ్చాడు. గుజరాత్ టైటాన్స్ అభిమానులు మోహిత్ శర్మ నుండి అద్భుతం ఆశించారు, కానీ భారీగా ప‌రుగులు ఇచ్చి అతను తన సొంత జట్టు ఓటమిలో ఒక‌ కారణం అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో మోహిత్ శర్మను అభిమానులు కనికరం లేకుండా ట్రోల్ చేస్తున్నారు.   

KL Rahul : ఫ్లయింగ్ మ్యాన్.. క‌ళ్లుచెదిరే సూప‌ర్ క్యాచ్ ప‌ట్టిన కేఎల్ రాహుల్.. వీడియో

 

 

 

 

ఐపీఎల్ 2024లో మోహిత్ శర్మ 'ట్రిపుల్ సెంచరీ' 

35 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ ఐపీఎల్ 2024లో 9 మ్యాచ్‌లలో 32.10 బౌలింగ్ సగటుతో 321 పరుగులు ఇచ్చాడు. 10 వికెట్లు తీసుకున్నాడు.

6,6,6,6.. రిషబ్ పంత్ విధ్వంసంతో స్టేడియం ద‌ద్ద‌రిల్లింది.. !

 

Follow Us:
Download App:
  • android
  • ios