Asianet News TeluguAsianet News Telugu

KKR vs PBKS : కోల్ క‌తా సునామీ ఇన్నింగ్స్.. ఏడేండ్ల రికార్డు బ్రేక్

KKR vs PBKS : ఐపీఎల్ 2024 లో పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ప్లేయ‌ర్లు బ్యాట్ తో దుమ్మురేపారు. ఓపెన‌ర్లు సునీల్ న‌రైన్, ఫిల్ సాల్ట్ లు సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టారు. 
 

KKR vs PBKS : Kolkata Tsunami innings.. seven years record break Sunil Narine, Phil Salt RMA
Author
First Published Apr 26, 2024, 11:56 PM IST

KKR vs PBKS :  ఐపీఎల్ 2024 42వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ్డాయి. కేకేఆర్ తొలుత బ్యాటింగ్ తో తుఫాను ఇన్నింగ్స్ తో దుమ్మురేపింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 261 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ బ్యాటర్లు ప్రకంపనలు సృష్టించారు. ఫిలిప్ సాల్ట్ 37 బంతుల్లో 75 పరుగులు, సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 10.2 ఓవర్లలో 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

పవర్‌ప్లేలో నరైన్-సాల్ట్ దుమ్మురేపారు.. 

ఈ ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో సునీల్ నరైన్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలోని టాప్-5 బ్యాట్స్‌మెన్‌లలో ఇద్దరు కేకేఆర్ ప్లేయ‌ర్లు ఉండ‌టం విశేషం. నరైన్ 177.39 స్ట్రైక్ రేట్‌తో 204 పరుగులు చేశాడు. కాగా, ఫిలిప్ సాల్ట్ 175.45 స్ట్రైక్ రేట్‌తో 193 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను 229.20 స్ట్రైక్ రేట్‌తో 259 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 155.39 స్ట్రైక్ రేట్‌తో 216 పరుగులు చేశాడు.

7 సంవత్సరాల త‌ర్వాత‌.. 

7 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతాకు ఇది ఎనిమిదో సెంచరీ ఓపెనింగ్ భాగస్వామ్యం కాగా 2017 తర్వాత ఇదే తొలిసారి. సునీల్ నరైన్, క్రిస్ లిన్ చివరిసారిగా 2017లో బెంగళూరులో ఆర్సీబీపై 105 పరుగులు జోడించారు.

ఐపీఎల్ లో కేకేఆర్ నుంచి అత్యధిక భాగస్వామ్యం.. 

184* - గౌతమ్ గంభీర్ - క్రిస్ లిన్ vs గుజరాత్ లయన్స్, రాజ్‌కోట్, 2017
158 - గౌతమ్ గంభీర్ - రాబిన్ ఉతప్ప vs రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పూణె, 2017
152* - గౌతమ్ గంభీర్ - జాక్వెస్ కల్లిస్ vs రాజస్థాన్ రాయల్స్, 1 జైపూర్,
138 - సునీల్ న‌రైన్ - ఫిల్ సాల్ట్ vs పంజాబ్ కింగ్స్, కోల్‌కతా, 2024
136 - మన్విందర్ బిస్లా-జాక్వెస్ కల్లిస్ vs చెన్నై సూపర్ కింగ్స్, చెన్నై, 2012 ఫైనల్ 

పఠాన్‌ను అధిగమించిన నరేన్ 

కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సునీల్ నరైన్ తన సిక్సర్ల సంఖ్యను 88 పెంచుకున్నాడు. దీంతో జట్టు తరఫున ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌లలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ అగ్రస్థానంలో ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రస్సెల్ ఖాతాలో 201 సిక్సర్లు ఉన్నాయి. నితీష్ రాణా 106 సిక్సర్లు, సునీల్ నరైన్ 88, యూసుఫ్ పఠాన్ 85, రాబిన్ ఉతప్ప 85 సిక్సర్లు కొట్టారు.

 

 

KKR VS PBKS : సునీల్ న‌రైన్ విధ్వంసం.. దుమ్మురేపిన ఫిల్ సాల్ట్.. 

Follow Us:
Download App:
  • android
  • ios