Asianet News TeluguAsianet News Telugu

6,6,6,6.. రిషబ్ పంత్ విధ్వంసంతో స్టేడియం ద‌ద్ద‌రిల్లింది.. !

DC vs GT: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రిషబ్ పంత్ విధ్వంసం కొన‌సాగింది. గుజరాత్ తో జ‌రిగిన మ్యాచ్ లో మోహిత్ శ‌ర్మ బౌలింగ్ ను చిత్తుచేస్తూ పంత్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ను ఆడాడు. 
 

DC vs GT: 6,6,6,6.. Rishabh Pant's destruction made the Delhi stadium rumble, IPL 2024 RMA
Author
First Published Apr 24, 2024, 11:30 PM IST

IPL 2024 DC vs GT : టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ అభిమానులకు విందును పంచాడు. త‌న బౌల‌ర్ల‌కు త‌న బ్యాట్ ప‌వ‌ర్ ను చూపించాడు. ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ను ఆడాడు. ప్రమాదం కారణంగా చాలా కాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్, ఐపీఎల్ 2024లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడం విశేషం. ఐపీఎల్ 2024 40వ మ్యాచ్ లో గుజరాత్‌-ఢిల్లీ మ్యాచ్‌లో ఈ సీజన్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. మ‌రీ ముఖ్యంగా గుజ‌రాత్ బౌల‌ర్ మోహిత్ శ‌ర్మ‌ను ఒక ఆట ఆడుకున్నాడు. దీంతో ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ ఐపీఎల్ లో చెత్త రికార్డును న‌మోదుచేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్పెల్ బౌలింగ్ చేసిన బౌలర్‌గా మోహిత్ శర్మ నిలిచాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పవర్ ప్లేలో 3 వికెట్లు పడగొట్టి బౌలర్లు శుభారంభం చేశారు. కానీ అక్షర్ పటేల్, రిషబ్ పంత్ మాత్రం గోడలా నిలిచారు. ఢిల్లీకి భారీ స్కోరును అందించారు. వీరిద్దరి మధ్య వేగవంతమైన సెంచరీ భాగస్వామ్యం కనిపించింది. అక్షర్ పటేల్ 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 66 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ త‌ర్వాత జ‌ట్టు స్కోరును మ‌రింత పెంచే బాధ్యతను కెప్టెన్ రిష‌బ్ పంత్ తీసుకున్నాడు. వ‌రుస‌గా ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డుతూ రికార్డు హాఫ్ సెంచ‌రీ సాధించాడు. గుజరాత్ సీనియ‌ర్ బౌలర్ మోహిత్ శర్మ బౌలింగ్ ను ఉతికిపారేశాడు. పంత్ ఆడిన ప్ర‌తి ఓవ‌ర్ లోనూ బౌండ‌రీలు బాదాడు.

T20 World Cup 2024 యాక్ష‌న్ కు మీరు సిద్ద‌మా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా సాంగ్

ఓవ‌ర్ లో విధ్వంసం.. 

20వ ఓవర్లో కెప్టెన్ గిల్ బంతిని మోహిత్ శర్మకు అందించాడు. తొలి బంతికే రెండు పరుగులు వ‌చ్చాయి. రెండో బంతి వైడ్‌ అయింది. దాని రెండో బంతికి పంత్  భారీ సిక్స్ కొట్టాడు. మూడో బంతికి ఫోర్‌ వచ్చింది. ఆ తర్వాతి 3 బంతుల్లో పంత్ హ్యాట్రిక్ సిక్సర్లు బాది 30 పరుగులు చేశాడు. ఈ ఓవర్‌లో మొత్తం 31 పరుగులు రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్కోరు 224కి చేరుకుంది. చివరి ఓవర్ తర్వాత, మోహిత్ శర్మ తన పేరు మీద చెత్త రికార్డును న‌మోదుచేశాడు.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్పెల్ బౌలింగ్ చేసిన బౌలర్‌గా మోహిత్ శర్మ చెత్త రికార్డును న‌మోదుచేశాడు. 4 ఓవర్లలో ఒక్క‌వికెట్ కూడా తీయ‌కుండా ఏకంగా 73 పరుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అంతకుముందు 2018 సంవత్సరంలో, బాసిల్ థంపి హైదరాబాద్‌కు ఆడుతున్నప్పుడు, ఎటువంటి వికెట్ పడకుండా 4 ఓవర్లలో 70 పరుగులు స‌మ‌ర్పించుకున్నాడు.  గత సీజన్‌లో చివరి ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టిన తర్వాత యష్ దయాల్ తన పేరిట రికార్డును కూడా కలిగి ఉన్నాడు. అతను 4 ఓవర్లలో 69 పరుగులు స‌మ‌ర్పించుకున్నాడు. తాజా మ్యాచ్ లో రిష‌బ్ పంత్ కేవ‌లం 43 బంతుల్లోనే 88 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ తో 5 ఫోర్లు, 8 సిక్స‌ర్లు బాదాడు.

 

 

KL Rahul : ఫ్లయింగ్ మ్యాన్.. క‌ళ్లుచెదిరే సూప‌ర్ క్యాచ్ ప‌ట్టిన కేఎల్ రాహుల్.. వీడియో

Follow Us:
Download App:
  • android
  • ios