Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్-19 నాలుగో వేవ్ వ‌స్తుందా ? యూఎస్ లో కొత్త కేసుల వెనుక ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ ?

కరోనా వైరస్ ఏ క్షణంలో బయటపడిందో కానీ ఇది మానవజాతిని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇప్పటికే మూడు వేవ్ లు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ఇప్పుడు నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. 

Will covid-19 make the fourth wave? The Omicron Sube variant behind the new cases in the US?
Author
New Delhi, First Published Mar 17, 2022, 10:07 AM IST

కరోనా వైర‌స్ (coroan virus) మనుషుల్ని విడిచి వెళ్లేలా కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే థ‌ర్డ్ వేవ్ త‌గ్గి మ‌ళ్లీ జ‌న జీవ‌నం గాడిలో ప‌డుతోంది అనుకుంటున్న స‌మ‌యంలో మ‌ళ్లీ యూఎస్, చైనా వంటి దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. అయితే ఈ కేసుల పెరుగుద‌లను గ‌మ‌నిస్తే మ‌ళ్లీ మ‌రో వేవ్ వ‌స్తుందా అనే ఆందోళ‌న‌ల‌కు ఎక్కువ‌వుతున్నాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తాజా గా విడుద‌ల చేసిన డేటా ప్ర‌కారం యూఎస్ లో బ‌య‌ట‌ప‌డుతున్న కొత్త కోవిడ్ కేసుల్లో నాలుగింట ఒక వంతు ఒమిక్రాన్ కు చెందిన BA.2 స‌బ్ వేరియంట్ క‌నిపిస్తోంది. 

ఈ డేటా ప్ర‌కారం ఒక వారం రోజుల వ్య‌వ‌ధిలోనే 1 నుంచి 10 కొత్త కేసులు ఈ స‌బ్ వేరియంట్ ర‌కానికి చెందినవి బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. CDC విడుద‌ల చేసిన డేటా ప్ర‌కారం ప‌రిశీలిస్తే BA.2 వేరియంట్ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ ఇన్ఫెక్ష‌న్లు దాదాపు ప్ర‌తీ వారం రెట్టింపు అవుతున్నాయి. 

BA.2 స‌బ్ వేరియంట్  Omicron కంటే 30 శాతం వరకు అధికంగా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని తాజా నివేదిక‌లు తెలియ‌జేశాయి. కాగా COVID-19 కేసులలో ప్రపంచ వ్యాప్తంగా పెరుగుదలను చూపించే గణాంకాలు చాలా పెద్ద స‌మ‌స్య‌గా మారాయి. ఎందుకంటే కొన్ని దేశాలు ప‌రీక్ష రేట్ల‌ను త‌గ్గించిన‌ట్టుగా చూపిస్తున్నాయి. అయితే కొత్త వైర‌స్ ప‌ట్ల అప్ర‌మత్తంగా ఉండాల‌ని WHO ప్ర‌పంచ దేశాల‌ను హెచ్చరించింది. గ‌త నెల రోజులుగా కోవిడ్ -19 కేసుల్లో క్షీణ‌త క‌నిపించిన‌ప్ప‌టికీ.. గ‌త వారం రోజులుగా ప్ర‌పంచ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయ‌ని WHO తెలిపింది. ఆసియా, చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో లాక్ డౌన్ విధించ‌డం ద్వారా క‌రోనా కేసుల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి పోరాడుతున్నాయి. ప్ర‌జారోగ్యం, సామాజిక చర్యలను ఎత్తివేయడం వ‌ల్ల ఒమిక్రాన్, BA.2 సబ్ వేరియంట్ లు వేగంగా వ్యాపిస్తోంద‌ని WHO తెలిపింది. 

‘‘ కొన్ని దేశాలలో పరీక్షలు తగ్గినప్పటికీ కేసుల్లో పెరుగదల కనిపిస్తోంది. అంటే మనం చూస్తున్న కేసులు ప్రారంభం మాత్రమే ’’ అని WHO అధిపతి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మీడియాతో తెలిపారు. కొన్ని దేశాలలో తక్కువగా కోవిడ్ -19 వ్యాక్సిన్ లు ఇవ్వ‌డం, భారీ మొత్తంలో తప్పుడు సమాచారం ఇవ్వ‌డం కూడా కోవిడ్ -19 పెరుగుద‌ల కు కార‌ణం అవుతోంద‌ని WHO అధికారులు తెలిపారు.

గత వారంతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఇన్ఫెక్షన్లు 8 శాతం పెరిగాయి. మార్చి 7-13 వరకు 11 మిలియన్ కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 43,000 కొత్త మరణాలు నమోదయ్యాయి. జనవరి నెలాఖరు తర్వాత ఇంత భారీ సంఖ్య‌లో కేసులు పెరగడం ఇదే తొలిసారి. ద‌క్షిణ కొరియా, చైనాలో 25 శాతం కొత్త కేసుల‌, 27 శాతం మ‌ర‌ణాలు పెరిగాయి. ఆఫ్రికాలో కొత్త కేసులు 12 శాతం, 14 శాతం మరణాలు పెరిగాయి. యూర‌ప్ లో 2 శాతం కేసులు పెరిగినా.. మరణాలలో పెరుగుదల క‌నిపించ‌లేదు. తూర్పు మధ్యధరా ప్రాంతంతో సహా ఇతర ప్రాంతాల్లో కేసులు త‌గ్గుతున్న‌ట్టు నివేదిక‌లు వ‌చ్చాయి. అయితే ఈ ప్రాంతంలో మరణాలు 38 శాతం పెరుగుద‌ల క‌నిపించింది. ఇవి గ‌త ఇన్ఫెక్ష‌న్ ల పెరుగుదల వ‌ల్ల సంభ‌వించాయి.

ఆస్ట్రియా, జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో మార్చి ప్రారంభం నుండి కేసులు పెరుగుతుండటంతో.. యూరప్ మ‌రో కొత్త కరోనా వేవ్ ను ఎదర్కొనే అవ‌కాశం ఉంద‌ని అనేక మంది నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు BA.2 స‌బ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే వైర‌స్ గా ఉంద‌ని WHO కు చెందిన మరియా వాన్ కెర్‌ఖోవ్ తెలిపారు. అయితే ఇది తీవ్ర అనారోగ్యానికి గురి చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios