Asianet News TeluguAsianet News Telugu

corona virus : నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో పార్క్స్, బీచ్ లు, గార్డెన్ లు ఓపెన్.. కానీ..

మహారాష్ట్రలో నేటి నుంచి పార్క్ లు, స్విమ్మింగ్ పూల్స్, స్పా సెంటర్ల, జిమ్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం వరకు దీనిని 11 జిల్లాల్లో మాత్రమే అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

corona virus: Parks, beaches and gardens are open in Maharashtra from today .. but ..
Author
Mumbai, First Published Feb 1, 2022, 9:17 AM IST

దేశంలో క‌రోనా (corona)కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన ఆంక్ష‌ల‌ను కొంచెం స‌డ‌లిస్తున్నాయి. అందులో భాగంగానే మ‌హారాష్ట్ర (maharastra) ప్ర‌భుత్వం సోమ‌వారం  ఓ నిర్ణ‌యం తీసుకుంది. పార్క్స్ లు (parks), బీచ్ లు (beaches), గార్డెన్ (gardens)లను అలాగే స్పా (spa)సెంట‌ర్ల‌ను కూడా ఓపెన్ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వులు ఫిబ్ర‌వ‌రి 1వ (మంగ‌ళ‌వారం) తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. అయితే క‌రోనా నిబంధ‌న‌లు మాత్రం కచ్చితంగా పాటించాల‌ని సూచించింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే ప్ర‌వేశానికి అనుమ‌తి ఇస్తామ‌ని తెలిపింది. 

సోమవారం అర్థరాత్రి వ‌ర‌కు మహారాష్ట్ర ప్రభుత్వం త‌న రాష్ట్ర జ‌నాభాలో 90 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ (corona vaccine) మొద‌టి డోసు,  70 శాతం మందికి రెండో డోసు వ్యాక్సిన్ లు అందించింది. దీంతో కోవిడ్ ప‌రిస్థితిపై స‌మీక్ష జ‌రిపి క‌రోనా ఆంక్ష‌ల‌ను స‌డ‌లించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం అన్ని పర్యాటక ప్రదేశాలు (జాతీయ పార్కుల‌తో సహా) యథావిధిగా తెరిచి ఉంటాయి. స్థానిక అధికారులు నిర్ణయించిన సమయాల ప్రకారం బీచ్‌లు, గార్డెన్‌లు, పార్కులు కూడా అందుబాటులో ఉంటాయి.  అయితే స్పాలు మాత్రం 50% సామర్థ్యంతో పని చేయ‌డానికే అనుమ‌తి ఇచ్చారు. 

‘‘ రాష్ట్రంలో ఆన్‌లైన్ టికెటింగ్‌ (online ticketign)తో అన్ని జాతీయ పార్కులు, సఫారీలు సాధారణ సమయాల ప్రకారం తెరిచి ఉంటాయి. కోవిడ్ -19 మహమ్మారి దృష్ట్యా సందర్శకులందరూ తప్పనిసరిగా పూర్తిగా టీకాలు వేసుకోవాలి. స్థానిక అధికారులు పర్యాటకలు సంఖ్యపై సహేతుకమైన పరిమితులు విధించవచ్చు.” అని మహారాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విడుద‌ల చేసిన వివ‌రాల ప్ర‌కారం.. ముంబై (mumbai), పూణె (pune)తో సహా ప్ర‌స్తుతం వ‌ర‌కు 11 జిల్లాలకు కొత్త నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ లిస్ట్ వారానికోసారి అప్డేట్ అవుతూ ఉంటుంది. రాష్ట్రంలో COVID-19 కేసులు తగ్గుతున్నాయి. సోమవారం 15,140 కొత్త కోవిడ్ -19 కేసులు (ఆదివారం కంటే 7,304 తక్కువ) న‌మోద‌య్యాయి. అలాగే  39 మరణాలు వెలుగుచూశాయి. దీంతో ప్రస్తుతం మ‌హారాష్ట్ర‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,07,350 కు చేరుకుంది. 

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. వాటర్ పార్కులు. స్విమ్మింగ్ పూల్‌లు, థీమ్ పార్కులు, 50 శాతం యాక్టివిటీతో ప‌ని చేస్తాయి. అలాగే రెస్టారెంట్లు, థియేటర్లు, నాట్య గృహాలు వంటి బహిరంగ ప్రదేశాలు DDMA ద్వారా నిర్ణయించే సమయాల ప్రకారం 50 శాతం సామ‌ర్థ్యంతో ప‌ని చేస్తాయి.  అలాగే  భ‌జ‌న‌లు, ఇతర అన్ని స్థానిక, సాంస్కృతిక, జానపద వినోద కార్యక్రమాలు 50 శాతం సామ‌ర్థ్యంతో నిర్వ‌హించుకోవ‌చ్చు. వివాహాలకు ఓపెన్ గ్రౌండ్, బాంకెట్ హాల్స్ సామర్థ్యంలో 25 శాతం లేదా 200 మంది వ‌ర‌కు అథితులు హాజ‌ర‌వ‌చ్చు. ఇందులో ఏది త‌క్కువైతే అది వ‌ర్తిస్తుందని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం త‌న నోటిఫికేష‌న్ లో పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios