Asianet News TeluguAsianet News Telugu

మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌న‌.. 145 రోజుల త‌రువాత ఒక్క సారిగా 20,000 కేసులు, 38 మ‌ర‌ణాలు న‌మోదు

కొంత కాలం కిందట వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 38 మరణాలు సంభవించాయి. 

Corona outbreak again.. 20,000 cases and 38 deaths recorded at one time after 145 days
Author
New Delhi, First Published Jul 14, 2022, 1:31 PM IST

దేశంలో మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తోంది. కేసులు ఒక్క సారిగా పెరుగుతున్నాయి. 145 విరామం త‌రువాత  20,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1,36,076కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్ర‌క‌టించింది. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో మొత్తం 20,139 కొత్త కోవిడ్-19 కేసులు వెలుగులోకి వ‌చ్చాయ‌ని తెలిపింది. ఈ తాజా లెక్క‌ల‌తో క‌లుపుకుంటే మొత్తంగా క‌రోనా కేసుల సంఖ్య 4,36,89,989కి చేరుకుంది.

భారీ వ‌ర్షాల‌తో థానేలో కూలిన ఇళ్లు.. అహ్మదాబాద్-ముంబయి నేష‌న‌ల్ హైవే మూసివేత

24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 38 కొత్త మ‌ర‌ణించారు. దీంతో మ‌ర‌ణాల సంఖ్య 5,25,557కి చేరుకుంద‌ని గురువారం ఉద‌యం 8 గంటలకు అప్ డేట్ అయిన డేటా పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.31 శాతం ఉండగా జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.49 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.10 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 4.37 శాతంగా నమోదైంది, వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,30,28,356 కు పెరిగింది. అయితే కేసు మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.

విద్యార్థి కోసం కారు ప్రయాణం ఏర్పాటు చేసిన రైల్వే శాఖ.. గుజరాత్ లో అరుదైన ఘటన..

మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు 199.27 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించారు. భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 2020 ఆగస్టు 7వ తేదీన 20 లక్షలు, ఆగస్టు 23వ తేదీన‌ 30 లక్షలు, సెప్టెంబర్ 5వ తేదీన 40 లక్షలు, సెప్టెంబర్ 16వ తేదీన‌ 50 లక్షలు దాటింద‌ని పేర్కొంది.  సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. గ‌తేడాది మే 4న దేశంలో రెండు కోట్ల కేసుల మైలురాయిని అధిగమించింది. జూన్ 23న మూడు కోట్లు, ఈ ఏడాది జనవరి 25న నాలుగు కోట్ల మార్కును దాటింది.

ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్.. ఇటీవల కోవిడ్ సోకడంతో..

తాజాగా న‌మోదైన 38 కొత్త మరణాలలో కేరళలో 16 మంది, మహారాష్ట్రలో 10 మంది, పశ్చిమ బెంగాల్ లో నలుగురు, ఢిల్లీలో ముగ్గురు, అస్సాం, బీహార్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లో ఒక్క‌రు చొప్పున మ‌ర‌ణించారు. మొత్తంగా మహారాష్ట్రలో 1,48,001, కేరళలో 70,186, కర్ణాటకలో 40,125, తమిళనాడులో 38,028, ఢిల్లీలో 26,288, ఉత్తరప్రదేశ్ లో 23,549, పశ్చిమ బెంగాల్ లో 21,255 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అయితే ఈ మ‌ర‌ణాల్లో 70 శాతం మంది కోమోర్బిడిటీల ఉండ‌టం వ‌ల్ల‌నే సంభవించాయని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. 

Follow Us:
Download App:
  • android
  • ios