Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ బౌన్స్: కోలుకున్న సెన్సెక్స్, నిఫ్టీ.. 200 పాయింట్లు జంప్..

అయితే ఉదయం 9.20 గంటల ప్రాంతంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 212 పాయింట్లు లేదా 0.29 శాతం పెరిగి 72,233 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ50 71 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 21,888 వద్ద ట్రేడవుతోంది.
 

Sensex Opening Bell: Rise in stock market; Sensex strengthened by 200 points, Nifty crossed 21850-sak
Author
First Published Mar 20, 2024, 10:48 AM IST

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై  నిర్ణయానికి ముందు ప్రపంచ మార్కెట్ల సంకేతాల ఆధారంగా భారత స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ బుధవారం గ్రీన్ మార్క్ లో  ప్రారంభమైంది. ప్రారంభంలో  ఆటో, ఐటీ రంగాల షేర్లు బలాన్ని ప్రదర్శించాయి.

అయితే ఉదయం 9.20 గంటల ప్రాంతంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 212 పాయింట్లు లేదా 0.29 శాతం పెరిగి 72,233 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ50 71 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 21,888 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్ స్టాక్స్‌లో, మారుతీ, హెచ్‌సిఎల్ టెక్, విప్రో అండ్  పవర్ గ్రిడ్ ప్రారంభ ట్రేడ్‌లో ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభాలతో అగ్రస్థానంలో ఉన్నాయి. అదే సమయంలో హెచ్‌యుఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు క్షీణించాయి. సెక్టార్ల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.1%, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.6% చొప్పున పెరిగాయి.

నిఫ్టీ ఐటీ, మెటల్, రియల్టీ ఇంకా ఆయిల్ & గ్యాస్ కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి, నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి అలాగే కన్స్యూమర్ డ్యూరబుల్స్ క్షీణించాయి. స్టాక్ మార్కెట్ బుధవారం క్లోసింగ్  బెల్ తర్వాత ఫెడ్  నిర్ణయంలో రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉంది. అయితే ఫెడ్ నిర్ణయం మార్కెట్ కదలికలపై ప్రభావం చూపుతుంది.

అయితే, వారంలో మూడవ ట్రేడింగ్ రోజైన బుధవారం, స్టాక్ మార్కెట్ ప్రారంభ లాభాల తర్వాత ఎగువ స్థాయిల నుండి అమ్మకాలను చూసింది.

ప్రస్తుత వారం రెండో ట్రేడింగ్ రోజున అంటే మంగళవారం  స్టాక్ మార్కెట్‌లో అమ్మకందారుల జోరు మరోసారి కనిపించింది. మంగళవారం సెన్సెక్స్ 736.37 పాయింట్లు పడిపోయి 72,012.05 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 238.25 పాయింట్ల నష్టంతో 21,817.45 పాయింట్లకు చేరుకుంది.

నిజానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ ఇంకా  రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి. అంతేకాదు ఇతర ఆసియా మార్కెట్లు కూడా క్షీణించాయి. ఇది కాకుండా, విదేశీ నిధుల ఉపసంహరణ మధ్య స్టాక్ సూచీలు సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ మంగళవారం ఒక్కొక్కటి చొప్పున పడిపోయాయి. 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా వడ్డీరేట్లను పెంచుతూ జపాన్ సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం కూడా మార్కెట్‌పై ఒత్తిడి తెచ్చింది.

స్టాక్ మార్కెట్ కదలిక  
BSE   30-షేర్ ఇండెక్స్ సెన్సెక్స్ 736.37 పాయింట్లు లేదా 1.01 శాతం పడిపోయి 72,012.05 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 815.07 పాయింట్లు పడిపోయి 71,933.35 పాయింట్లకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 238.25 పాయింట్లు లేదా 1.08 శాతం పడిపోయి 21,817.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 50 నిఫ్టీ స్టాక్స్‌లో 41 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.

ఎవరికి నష్టం, ఎవరికి లాభం?
సెన్సెక్స్ షేర్లలో టీసీఎస్ నాలుగు శాతానికి పైగా పడిపోయింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, విప్రో, నెస్లే, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, ఐటిసి, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ అలాగే  అల్ట్రాటెక్ సిమెంట్‌లో  కూడా క్షీణత కనిపించింది. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటన్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ముగిశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios