OnePlus Nord 3: నేడు భారత మార్కెట్లో వన్ ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ విడుదల, ధర, ఫీచర్లు చక చకా తెలుసుకోండి

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Nord 3 5Gని నేడు భారత్ లో లాంచ్ చేసింది. దీంతో పాటు, కంపెనీ ఇయర్‌బడ్ వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్‌ను కూడా విడుదల చేసింది. OnePlus Nord 3 5G స్మార్ట్‌ఫోన్, ఇయర్‌బడ్‌ల సేల్ జూలై 15 నుండి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర గురించి తెలుసుకుందాం.

OnePlus Nord 3: Know OnePlus Nord 3 Smartphone Launch, Price, Features in India Today MKA

OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ చేశారు. దీని ముఖ్య స్పెసిఫికేషన్‌ల గురించి మాట్లాడుకుంటే, ఇది MediaTek డైమెన్సిటీ 9000 SoC, 16GB వరకు RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ప్యాక్ చేస్తుంది. ఈ ఫోన్ గతేడాది ప్రారంభించిన OnePlus Nord 2Tకి అప్‌గ్రేడ్ వర్షన్ అని చెప్పవచ్చు. దీంతో పాటు, కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్స్ OnePlus Nord CE 3 అలాగే OnePlus Buds 2rlలను విడుదల చేసింది. 

OnePlus Nord 3 రెండు వేరియంట్లలో మార్కెట్లోకి ప్రవేశించింది.  8GB LPDDR5X RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999. రెండవ వేరియంట్‌లో, 16GB LPDDR5X RAM  256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది, దీని ధర రూ.37,999. ఇక OnePlus Buds 2r ధర రూ. 2199 మాత్రమే కావడం విశేషం. అదే సమయంలో, OnePlus Nord CE 3 రెండు వేరియంట్‌లలో ప్రవేశపెట్టారు. దీని ప్రారంభ ధర రూ. 26,999 ఉండటం విశేషం.  

OnePlus Nord 3 స్పెసిఫికేషన్‌లు 
OnePlus Nord 3 ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 6.74-అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 93.5 శాతంగా ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 9000 SoC చిప్‌సెట్‌తో వస్తుంది. ఫోన్ 16GB LPDDR5X RAM, 256GB UFS3.1 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. 

OnePlus Nord 3 బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జర్ 
OnePlus Nord 3 యొక్క ఈ మొబైల్ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జర్‌తో కలిసి వస్తోంది, ఇది బాక్స్‌లో వస్తుంది. ఈ OnePlus ఫోన్ OnePlus Nord 3 ఆధారిత OxygenOS 13.1పై పని చేస్తుంది. 

OnePlus Nord 3 కెమెరా సెటప్ 
OnePlus Nord 3 వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఇందులో, ప్రైమరీ కెమెరాకు 50MP Sony IMX890 సెన్సార్‌తో OIS మద్దతు లభిస్తుంది. సెకండరీ కెమెరా 8MP, ఇది IMX355 వైడ్ యాంగిల్ లెన్స్. ఇందులో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా లెన్స్ ఉంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో సెల్ఫీ తీసుకోవడంతో పాటు, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంచారు. 

Nord Buds 2r యొక్క లక్షణాలు 
Nord Buds 2r 12.4mm XL డ్రైవర్లను కలిగి ఉంది, ఇది డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో వస్తుంది. ఇయర్‌బడ్‌ల చుట్టూ టచ్ కంట్రోల్‌లు ఉన్నాయి, తద్వారా వినియోగదారులు సంగీతాన్ని ప్లే చేయవచ్చు  పాజ్ చేయవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 38 గంటల బ్యాకప్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios