Asianet News TeluguAsianet News Telugu

ఓటు వేస్తున్నారా.. ఈ యాప్స్ తో ఎలక్షన్స్ వివరాలు అన్ని మీ అరచేతిలో...

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించనున్నారో  ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెల్లడించారు. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. 

loksabha elections 2024 information about new apps with detailed information about candidates voters and  more-sak
Author
First Published Mar 16, 2024, 7:22 PM IST

2024 లోక్‌సభ ఎన్నికల పూర్తి దశ,  తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. నేడు శనివారం మార్చి 16న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 19 నుంచి ప్రారంభమవుతాయని   చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌  తెలిపారు.  

అయితే దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించనున్నారో  ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెల్లడించారు. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. 

దేశంలో మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, దేశంలో 10 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని రాజీవ్ కుమార్ తెలిపారు.   ఈసారి 1 కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు వేయనున్నారు.  

ఇక నుండి దేశంలోని ఎన్నికలలో పాల్గొనే ప్రతి అభ్యర్థి గురించి పూర్తి   సమాచారం ఇవ్వబడుతుంది. అందుకోసం కొత్త టెక్నాలజీని, అభ్యర్థికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని  'నో యువర్ క్యాండిడేట్'  యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. 

ఎలెక్షన్స్ కి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్ లోని అఫీషియల్ యాప్స్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.  

loksabha elections 2024 information about new apps with detailed information about candidates voters and  more-sak

ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ (VHA app)గురించి

 ఈ యాప్ భారతీయ ఓటర్లకు కింది సౌకర్యాలను అందిస్తుంది:

A. ఎలెక్టోరల్ సెర్చ్  (ఎన్నికల లిస్ట్ లో మీ పేరును #GoVerify చేయండి)
B. కొత్త ఓటరు రిజిస్ట్రేషన్  కోసం ఆన్‌లైన్ ఫారమ్‌ సబ్మిషన్ 
C. ఎన్నికల సేవలకు సంబంధించిన ఫిర్యాదులను రిజిస్టర్ చేయడం 
D. ఓటరు, ఎన్నికలు, EVM & ఫలితాలపై తరచుగా అడిగే ప్రశ్నలు
E. ఓటర్లు & ఎన్నికల అధికారుల కోసం సర్వీసెస్ & సోర్సెస్ 
F: మీ ప్రాంతంలో ఎన్నికల షెడ్యూల్‌ వివరాలు
G: అభ్యర్థుల ప్రొఫైల్, ఆదాయల ప్రకటన, ఆస్తులు,  క్రిమినల్  కేసుల వివరాలు 
H: పోలింగ్ అధికారులను సంప్రదించడం: BLO, ERO, DEO అండ్  CEO

cVIGIL APP

cVIGIL ఆటోమాటిక్  లొకేషన్ డేటాతో డైరెక్ట్  ఫోటో/వీడియో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్  కండక్ట్/ ఖర్చుల  ఉల్లంఘనకు సంబంధించిన టైమ్ స్టాంప్డ్ ఈవిడేంటరీ  అందిస్తుంది. టైమ్‌స్టాంపింగ్   ఈ ప్రత్యేకమైన కలయిక, ఆటో లొకేషన్‌తో కూడిన లైవ్ ఫోటో సరైన ప్రదేశానికి నావిగేట్ చేయడానికి, సత్వర చర్య తీసుకోవడానికి ఎన్నికల యంత్రాంగానికి తగిన విధంగా ఆధారపడవచ్చు.  

భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన కొత్త cVIGIL యాప్ ఈ అన్ని ఖాళీలను నింపడానికి  అలాగే  ఫాస్ట్ ట్రాక్ ఫిర్యాదుల స్వీకరణ ఇంకా పరిష్కార వ్యవస్థను రూపొందిస్తుందని భావిస్తున్నారు. 'cVIGIL' అంటే విజిలెంట్ సిటిజన్ అండ్  ఫ్రీ  అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణలో పౌరులు పోషించగల యాక్టీవ్  అండ్ బాధ్యతాయుతమైన పాత్రను నొక్కి చెబుతుంది.

KYC-ECI  app 

 దేశంలో యాక్టీవ్  ప్రజాస్వామిక పౌరసత్వాన్ని నిర్మించేందుకు   నిరంతర ప్రయత్నాలను ముందుకు తీసుకువెళుతూ, అభ్యర్థుల నేర చరిత్రలకు సంబంధించి అభ్యర్థులు అందించిన  సమాచారాన్ని చూపించడానికి మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించడం ద్వారా భారత ఎన్నికల సంఘం కొత్త చొరవను చేపట్టింది. అతని/ఆమె మొబైల్ ఫోన్‌లో ఈ  సమాచారాన్ని పొందుతారు.
ఈ యాప్ భారతీయ ఓటర్లకు కింది సౌకర్యాలను అందిస్తుంది:

(1) నామినేషన్ వేసిన అభ్యర్థులందరి లిస్ట్
(2) అభ్యర్థి వివరాలు
(3) క్రిమినల్ పూర్వాపరాలతో సహా అభ్యర్థి అఫిడవిట్‌ 
(4) పేరు ద్వారా అభ్యర్థిని సెర్చ్ చేయడం 
(5) మీ అభ్యర్థి ఎవరో తెలుసుకోవడం 

Follow Us:
Download App:
  • android
  • ios