Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్, ఇండియాలో కొత్త ఉద్యోగాల ప్రకటన, ఇక లేఆఫ్‌ గొడవ ముగిసినట్లేనా..?

వరుస లే ఆఫ్ లతో టెక్నాలజీ ప్రపంచంలో ఉద్యోగులందరికీ చుక్కలు చూపిస్తున్న గూగుల్ ఇప్పుడు మరోసారి రిక్రూట్మెంట్ ప్లాన్స్ ప్రకటించి ఆశలు రేపుతోంది.. గూగుల్ ఇండియా ఎందుకు తగ్గినట్టుగానే రిక్రూట్మెంట్ ప్రకటించింది. పలు పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది.

Is the layoff dispute over Google announced new jobs in India, is that good news MKA
Author
First Published Feb 21, 2023, 9:45 AM IST

వరుసగా ఉద్యోగులను తొలగిస్తూ సంచలనానికి ధరలేపిన గూగుల్ ఇప్పుడు ఒక్కసారిగా మళ్లీ ఉద్యోగులను తీసుకుంటామంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.  దీంతో లే ఆఫ్ గొడవ ఇక ముగిసినట్టేనా అని టెక్నాలజీ వర్గంలో  చర్చ మొదలైంది. ఆర్థిక మాంద్యం మూలంగా అమెరికా సహా ప్రపంచంలోనే అన్ని దేశాల్లోనూ గూగుల్ తమ ఉద్యోగులను తగ్గిస్తూ వస్తోంది. తాజాగా భారత దేశంలో కూడా 450 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ప్రస్తుతం గూగుల్ నుంచి మరోసారి రిక్రూట్మెంట్ ప్రకటన చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

వరుస తొలగింపుల తర్వాత ప్రస్తుతం నియామక ప్రక్రియ ప్రారంభించి, Google CEO సుందర్ పిచాయ్ సంచలనానికి తెరలేపారు. గత నెలలో పిచాయ్ Google మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఆరు శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 12,000 మంది ఉద్యోగులు తొలగిస్తామని తెలిపారు. అయితే ఇప్పుడు వస్తున్న రిపోర్టులు గూగుల్ ఉద్యోగుల తొలగింపులను ముగించి నియామకాలను ప్రారంభించిందని చెబుతున్నాయి. గూగుల్ ఇండియా లింక్డ్‌ఇన్‌లో అనేక ఉద్యోగుల ఖాళీలను కూడా పోస్ట్ చేసింది.

మేనేజర్, స్టార్టప్ సక్సెస్ టీమ్, ఎంప్లాయీ రిలేషన్స్ పార్టనర్, స్టార్టప్ సక్సెస్ మేనేజర్, గూగుల్ క్లౌడ్, వెండర్ సొల్యూషన్స్ కన్సల్టెంట్, గూగుల్ క్లౌడ్, ప్రొడక్ట్ మేనేజర్, డేటాబేస్ ఇన్‌సైట్‌ ఉద్యోగుల కోసం గూగుల్ ఇండియా వెతుకుతోంది. హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్‌లలో Google కార్యాలయాల్లో పనిచేసేందుకు ఉద్యోగుల కోసం వెతుకుతోంది.

అయితే ఇప్పటికే పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలని పిచాయ్ తన ఉద్యోగులకు చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఉద్యోగులు అంతగా ఉత్పాదకంగా లేరన్న నిర్ధారణల ఆధారంగా పిచాయ్ కొత్త డిమాండ్ చేశారు. ప్రొడక్షన్ లోపాలను ఎత్తిచూపడంతో పాటు ఉద్యోగులపై కూడా పిచాయ్ తీవ్రంగా విమర్శించారు. “వాస్తవానికి,  కంపెనీలో ఇక్కడ పని చేయడానికి అర్హత లేని కొంతమంది వ్యక్తులు ఉండవచ్చు. అందుకు అంగీకరించలేని వారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన అన్నారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం గూగుల్ తో పాటు మరిన్ని  సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా ఉద్యోగులను మళ్లీ రిక్రూట్ చేసుకోవడం మొదలు పెడుతున్నాయి. భారతీయ IT దిగ్గజం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లేఆఫ్ ప్లాన్‌ ను పక్కన పెట్టి, కొత్త రిక్రూట్ మెంట్ దిశగా అడుగులు వేస్తోందని TCS చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్  తెలిపారు. అయితే FY23 మూడవ త్రైమాసికంలో 2,197 మంది ఉద్యోగులకు తగ్గించుకున్నట్లు తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios