Asianet News TeluguAsianet News Telugu

మహీంద్రాకి పోటీగా జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్స్, ధర ఇవే..

 జీప్ ఇండియా ఎట్టకేలకు రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌ను భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల చేయనుంది. అయితే మే నుంచి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
 

Jeep Wrangler Facelift to hit the Indian market this summer - Here are the specs & price!-sak
Author
First Published Apr 26, 2024, 7:30 PM IST

లెజెండరీ  కంపెనీ  జీప్ కొత్త రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్-రోడర్  అన్‌లిమిటెడ్, రూబికాన్ అనే రెండు వేరియంట్‌లలో వస్తుంది. పూర్తిగా డిఫరెంట్ ఎక్స్టీరియర్ అండ్  కొత్త ఫీచర్లతో ఈ కారు డెలివరీలు మే 2024 మధ్య నాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

 2024 రాంగ్లర్ అనేది జీప్ ఆఫ్-రోడర్,  సిగ్నేచర్ సెవెన్-స్లాట్ బ్లాక్-అవుట్ గ్రిల్, అప్‌డేట్ చేసిన ఫాసియాతో  పెద్ద బంపర్   ఇంకా అన్‌లిమిటెడ్ & రూబికాన్ వెర్షన్‌ల కోసం 18-అంగుళాల అండ్  17-అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. దీని విండ్‌షీల్డ్ ఇప్పుడు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ పొందుతుంది.

కొత్త కలర్ లవర్స్  కోసం రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఐదు ఎక్స్టీరియర్  షేడ్స్‌లో  వస్తుంది. అంటే బ్రైట్ వైట్, గ్రానైట్ క్రిస్టల్, ఫైర్‌క్రాకర్ రెడ్, బ్లాక్ ఇంకా సర్జ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో పొందవచ్చు. మీకు నచ్చిన కారులో గొప్ప ఆఫ్-రోడ్ అనుభవాన్ని  పొందటం  ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన అనుభవం. 

ఇంటీరియర్ ఫీచర్ల విషయానికొస్తే ఈ SUV ఇప్పుడు 12.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్  ఆపిల్ కార్-ప్లే, 12-వే పవర్ ఫ్రంట్ సీట్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, TPMS అలాగే  ADAS సూట్స్   పొందుతుంది.

ఈ రెండు కార్లు మే నుంచి అందుబాటులోకి రానుండగా, జీప్ రాంగ్లర్ అన్‌లిమిటెడ్ ధర రూ. 67.65 లక్షలు, జీప్ రాంగ్లర్ రూబికాన్ ధర రూ. 71.65 లక్షలగా ఉంటుందని అంచనా.

Follow Us:
Download App:
  • android
  • ios