Asianet News TeluguAsianet News Telugu

వాడకం అంటే ఇదేనెమో.. 5వేలతో అయ్యేది రూ.20తో.. వాట్ అన్ ఐడియా సర్ జి..

ఇండియన్స్  క్రియేటివిటీ  మళ్లీ మళ్లీ వైరల్ అవుతోంది. తక్కువ ఖర్చుతో ఊహకందని పరిష్కారం భారతదేశంలో తప్ప మరెక్కడా చూడలేరు. ఇప్పుడు టాటా మోటార్స్ కంపెనీ యాజమాన్యం ఈ కూడా ఆలోచనపై   స్పందించింది.
 

Broken mirror of the car, Tata Motors rioted for the owner's idea!-sak
Author
First Published Apr 24, 2024, 3:07 PM IST

అతి తక్కువ ఖర్చుతో ఏదైనా సమస్యకు పరిష్కారం కనుగొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సంఘటనలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ఈ కారణంగానే భారతదేశంలో క్రియేటివిటీ అనే  పదం ఎప్పుడూ ప్రబలంగా ఉంది. ఎవరూ ఊహించని రీతిలో ఆలోచించి స్థానిక స్థాయిలో పరిష్కారాలు వెతికే క్రియేటివిటీ మళ్లీ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఎందుకంటే ఒక కార్ ఓనర్  పగిలిన రియర్‌ వ్యూ అద్దని  ఫిక్స్ చేయడానికి   ఒక క్రియేటివిటీ ఆలోచనను ఉపయోగించాడు. అయితే అతని టాటా నెక్సాన్ ఈవీ కారు కుడి వైపు అద్దం పగిలింది. కొత్తది కొని పెట్టించాలన్న  ఖర్చుతో కూడుకున్నది, ఇదంతా ఎందుకని 20 రూపాయల అద్దం కొని అందులో ఫిక్స్ చేసాడు. ఇప్పడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ఓనర్  తెలివి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ట్రాఫిక్ సిగ్నల్ సమయంలో వెనుక కారులో ఉన్న ప్రయాణీకుడు ఈ వీడియోను రికార్డ్ చేశాడు. జూమ్ ఇన్ చేసి చూసినపుడు టాటా కారు ఓనర్    క్రియేటివిటీ ఆలోచన ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే ఈ కారు ధర 15 నుంచి 20 లక్షల రూపాయలు ఉంటుంది. కానీ అయితే ఈ  కారు కుడివైపు అద్దం  పగిలిపోయి ఉంది.

పగిలిన అద్దాన్ని రిపేర్ చేయడానికి కనీసం 5000 రూపాయలు కావాలి. అంత డబ్బు పెట్టి అద్దం ఎలా బిగించగలం? నగరంలో అద్దాలు లేకుండా  కారు  నడపడం ఎలా? ఇలాంటప్పుడు ఎక్కువ ఖర్చు లేకుండా ఈ సమస్యకు  ఒక కొత్త క్రియేటివిటీ పరిష్కారం కనుగొన్నాడు. దీంతో ఓనర్  కొత్త కార్ అద్దం ప్లేస్ లో రోడ్డు  పక్కన అమ్ముతున్న చిన్న అద్దాన్ని 20 రూపాయలకు కొని అందులో  ఫిక్స్ చేసాడు.

ఈ అద్దం  అతని  నెక్సాన్  కారు బ్లూ మిర్రర్ కాదు, ఇంట్లో మొఖం చూసుకునే  చిన్న పింక్ అద్దాన్ని పగిలిన కారు అడ్డం ప్లేస్ లో  పెట్టాడు.  ఈ అద్దం  కాస్త చిన్నగా ఉన్న   వెనుక వైపు చూడటానికి సరిపోతుంది. మీరు ఈ అద్దంలోంచి చూస్తే, మీ వెనుక ఉన్న కార్లన్నీ  కనిపిస్తుంది. అయితే 20 రూపాయలతో కారు అద్దం  సమస్య పరిష్కారమైంది. 

ఈ వీడియోకు భారీ కామెంట్లు వచ్చాయి. ఈ  కారు ఓనర్ ని నేను అభినందిస్తున్నాను అని చాలా మంది  పోస్ట్ చేసారు. ఎందుకంటే అతను  ఖరీదైన అద్దానికి బదులు కనీసం అద్దం అవసరాన్ని తీర్చే  అద్దం పెట్టాడు. దీని ద్వారా భద్రతపై మరింత శ్రద్ధ చూపినట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో చూస్తే అద్దాల ఉత్పత్తిని నిలిపివేస్తామని టాటా మోటార్స్ స్పందించింది.


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jibran😊 (@jibran_jazzy)

Follow Us:
Download App:
  • android
  • ios