Asianet News TeluguAsianet News Telugu

సీఎంవోకు ఉద్యోగ సంఘాల నేతలు..! పీఆర్సీపై సీఎం జగన్ చర్చిస్తేనే ఓకే.. లేదంటే..!

కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాయి. ఈ నేపథ్యంలోనే సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణలు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కనిపించారు. త్త పీఆర్సీపై అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఉద్యమం చేయాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే తప్పకుండా వెళతామని అన్నారు. అవి కూడా ముఖ్యమంత్రితో చర్చలు ఉంటేనే వెళ్తామని.. అధికారులతో చర్చలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు.
 

will fight unitedly against new PRC says employees unions
Author
Amaravathi, First Published Jan 20, 2022, 6:51 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం పీఆర్సీ(PRC)పై జారీ చేసిన కొత్త జీవో(GO)లపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. కొత్త పీఆర్సీతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని మండిపడుతున్నాయి. ఆందోళనలు చేస్తున్నాయి. ఏపీ NGOతో పాటు ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం సహా  పలు ఉద్యోగ సంఘాలు(Employees Union), ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళనకు సిద్దమంటూ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణలు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కనిపించారు. వీరు ఇరువురూ సీఎంవో కార్యాలయానికి వెళ్లారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ మాట్లాడుతూ.. తాము పీఆర్సీపై సీఎంవో ఉన్నత అధికారులతో చర్చించలేదని వివరించారు. అయితే, ఉద్యోగులకు సంబంధించిన ఓ ఫైల్ పెండింగ్‌లో ఉండిపోయిందని, దాని కోసం మాట్లాడటానికే వచ్చాం అని తెలిపారు. కొత్త పీఆర్సీపై అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఉద్యమం చేయాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ రోజే ఈ విషయంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, పీఆర్సీ జీవోలు వచ్చిన తర్వాత సీఎం జగన్‌ను ఇప్పటి వరకు కలువలేదని అన్నారు. పీఆర్సీ కోసం కచ్చితంగా అన్ని యూనియన్లు కలిసి ఉద్యమిస్తాయని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. అన్ని సంఘాలు కలిసే విషయంపై ఈ రోజు రాత్రికల్లా స్పష్టత వస్తుందని చెప్పారు. చర్చల గురించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ఒక వేళ ప్రభుత్వం చర్చలకు పిలిస్తే తప్పకుండా వెళతామని అన్నారు. అవి కూడా ముఖ్యమంత్రితో చర్చలు ఉంటేనే వెళ్తామని.. అధికారులతో చర్చలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం Ys Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios