Asianet News TeluguAsianet News Telugu

విశాఖ కిడ్నాప్ కేసు : జైల్లోనే వ్యూహం పన్నిన కిడ్నాపర్లు.. పక్కా ప్లాన్ తో అమలు...

విశాఖ కిడ్నాప్ కేసులో కిడ్నాపర్లు జైల్లో ఉన్నప్పుడే కిడ్నాప్ ప్లాన్ వేసినట్టుగా సమాచారం. హేమంత్, రాజేష్ లు జైల్లో కలుసుకున్నప్పుడే ఈ పథకం వేసి, బైటికి వచ్చాక పక్కాగా అమలు చేసినట్టు సమచారం. 

Visakha Kidnapping Case : Kidnappers strategized in jails - bsb
Author
First Published Jun 17, 2023, 8:31 AM IST

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపిన ఎంపీ ఎంపీపీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ కిడ్నాప్ కేసులో అనేక అనుమానాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కిడ్నాప్ ఆలోచన విశాఖపట్నంలోని జైల్లోనే మొగ్గ తొడిగింది అని తెలుస్తుంది.  ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కోలా వెంకట హేమంత్ కుమార్. అతను ఓ రియాల్టర్ కిడ్నాప్ చేసిన ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యాడు. మే 10న విడుదలయ్యాడు. మరో నిందితుడు రాజేష్ కూడా 2021 సెప్టెంబర్ లో టూ వీలర్ల చోరీ కేసులో అరెస్టై.. ఈ ఏడాది మే రెండవ తేదీన విడుదలయ్యాడు.

అయితే వీరిద్దరికీ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడే పరిచయం ఏర్పడి.. ఈ కిడ్నాప్ స్కెచ్ వేశారని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లలో తాను తీవ్రంగా నష్టపోయారని కాబట్టి బయటికి వెళ్లాక చేసే దూకుల్లో తనకు 40 శాతం వాటా ఇవ్వాలని రాజేష్ ను హేమంత్ కోరాడని తెలిసింది. ఈ నేపథ్యంలోనే జైలు నుంచి బయటికి వచ్చాక హేమంత్, రాజేష్ లు  ఎంపీ ఎంవీవీ కుమారుడు శరత్ ఇంటి దగ్గర రెక్కీ చేశారు.

విశాఖ కిడ్నాప్ : మూడురోజుల క్రితమే కిడ్నాప్, బాధితులను క్రికెట్ బ్యాట్లతో కొట్టి.. కత్తులతో బెదిరించి..బీభత్సం

ఇదే సమయంలో జూన్ 11వ తేదీన ఎంపీపీ కాలనీలో టాస్క్ ఫోర్స్ స్టేషన్లో ఏర్పాటుచేసిన కౌన్సిలింగ్ కు హేమంత్ హాజరయ్యాడు కూడా.  అటు కౌన్సిలింగ్ కు హాజరవుతూనే పగలంతా దోపిడీ ప్రణాళికల్లో ఉండిపోయారు. వీరు జైల్లో ప్రణాళిక వేసుకున్నట్టుగానే రాజేష్ కు చెందిన గాజువాక గ్యాంగ్ ను రంగంలోకి దింపారు.జూన్ 12వ తేదీ సోమవారం అర్ధరాత్రి 1.30గం.లకు హేమంత్, రాజేష్ ఓ బాల నేరస్తుడితో కలిసి ఋషికొండలోని శరత్ ఇంట్లోకి ప్రవేశించారు.  

అనుకున్న ప్లాన్ ప్రకారం అదే రోజు కిడ్నాప్ ముందు రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటి వద్ద బీట్ కానిస్టేబుల్ లకు కనిపించాడు హేమంత్. తర్వాత, ఎంపీ ఇంట్లోకి చొరబడిన కిడ్నాపర్లు  బీభత్సం సృష్టించారు. జీవిని కిడ్నాప్ చేసాక  పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేశారు.. అంత డబ్బు తన దగ్గర లేదని చెప్పడంతో ఎవరిని అప్పు అడగాలో కూడా హేమంత్ సూచించాడని తెలుస్తోంది. అలా కోటి రూపాయలు సమకూర్చి హేమంత్ గ్యాంగ్ చేతిలో పెట్టిన తర్వాత కానీ వారు శాంతించలేదు. ఈ మొత్తాన్ని డ్రైవర్ ద్వారా తెప్పించాడు జీవి. 

ఈ డబ్బులు 40 లక్షలను హేమంత్ తన ప్రియురాలు సుబ్బలక్ష్మికి పంపాడు. కేసులో బెయిల్ ఇప్పించేందుకు బి. రాజేష్ అనే  లాయర్ కి రూ.21 లక్షల పంపించాడు. మొదటి రోజు నుంచి కిడ్నాప్లో పాల్గొన్న ఓ బాలనేరస్తుడు గురువారం ఉదయం కిరాతకానికి భయపడి బయటకి పారిపోయాడు. మరో ఇద్దరు బాల నేరస్తులు వీరికి సహకరించారు. జూన్ 15వ తేదీన ఎంపీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిడ్నాప్ విషయం తెలుసుకొని నిఘా పెట్టారు.  

హేమంత్, జీవీల సెల్ఫోన్ లోకేషన్లు ఒకే దగ్గర ఉండడంతో  అనుమానం వచ్చింది. హేమంత్ కి ఫోన్ చేయగా తాను మధురవాడలో ఉన్నానని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. అనుమానంతో కిడ్నాపర్లు ఇంటి పైకి వెళ్లి చూడగా..  ఎంపీ ఇంటి చుట్టూ పోలీసులు కనిపించారు. దీంతో అక్కడ నుంచి వెంటనే పారిపోవాలి అనుకుని ఆడి కార్ డిక్కీలో శరత్ ను కుక్కారు. కారులో జీవీ, జ్యోతిలను ఎక్కించారు.  రాజేష్, ఎర్రోళ్ల సాయి కూడా కారులో ఎక్కారు. ఈ కారణ హేమంత్ నడిపించాడు.  

అయితే కొద్ది దూరం వెళ్ళగానే కారు పంచరవ్వడంతో.. రిపేర్ చేశారు.  ఆ తర్వాత బాధితులను దగ్గర్లోని జంక్షన్ లో దింపేసి వెళ్లిపోయారు. కిడ్నాపర్లు వెళ్తున్న కారును చేజ్ చేస్తున్న పోలీసులు దానికి అడ్డంగా తమ కార్లను పెట్టారు. కిడ్నాపర్లు ఆ కార్లను కొట్టుకుంటూ వెళ్లిపోవడానిక ప్రయత్నించగా కారు అదుపుతప్పి ఆగిపోయింది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలిపారు. కిడ్నాప్ చేసిన సమయంలో స్టేషన్లో సంతకం పెట్టాల్సి ఉన్న హేమంత్ అలా పెట్టకపోతే అనుమానం వస్తుందని ఎంపీ కుమారుడుతో బలవంతంగా పిఎం పాలెం స్టేషన్ కి ఫోన్ చేయించాడు. హేమంత్ తన పని మీదే వెళ్ళాడని మూడు రోజుల వరకు స్టేషన్కు రాడని చెప్పించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios